.
Home » » ఆశ్చర్యచకితుల్ని చేసే శ్యామ్‌‍సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 (7.0)

ఆశ్చర్యచకితుల్ని చేసే శ్యామ్‌‍సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 (7.0)

Written By Hot nd spicy on Thursday, 5 July 2012 | 09:20

ఐ ప్యాడ్ కంటే చిన్నదిగా ఉండే ట్యాబ్లెట్ కావాలని కోరుకునేవారికి శ్యామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2(7.0) చక్కగా సరిపోతుంది. అయితే మీరు అనుకునేంతగా ఈ కొత్త పరికరంగా మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తకపోవచ్చు. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 7ను ప్రారంభించడం ద్వారా ఆండ్రాయిడ్ ఫోనును తొలిసారిగా పరిచయం చేసన శ్యామ్‌సంగ్, ఈసారి మాత్రం కొత్తదనాన్ని చూపించడంలో కాస్తంత విఫలమయింది. 

ఆకృతి, స్పర్శ మరియు డిజైన్ :

మీరు మొదటిసారిగా ఈ ట్యాబ్‌ను గమనించినపుడు టైటానియమ్ సిల్వర్ కేసింగ్‌ను ఈ ఫోను కలిగి ఉండటాన్ని చూస్తారు. ప్లాస్టిక్ అనుభవాన్ని స్ఫురణకు తెచ్చే ఈ ట్యాబ్‌ను చూసినపుడు శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 మీకు జ్ఞప్తికి వస్తుంది. తళతళలాడే కొనభాగాలను కలిగి ఉండి, నునుపైన వెనుక భాగాన్ని కలిగి ఉన్న 2.7 అంగుళాల ట్యాబ్ చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సౌకర్యవంతంగా ఉండేవిధంగా దీన్ని తయారు చేయడం జరిగింది.

కేవలం 344 గ్రాముల బరువున్న ఈ ట్యాబ్ 7 అంగుళాల ట్యాబులకు చెందిన విభాగంలో తేలికయినది. ఇక మందం విషయానికి వస్తే, మరీ అంత మందంగా ఉండదు. కేవలం 10.5 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. ఈ ట్యాబ్‌ను పరిచయం చేయడం ద్వారా శ్యామ్‌సంగ్ మరో మైలురాయిని సృష్టిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. మిగిలిన ట్యాబ్‌లన్నిటికంటే ప్రత్యేకంగా ఉండే ఈ ట్యాబ్‌ను ఒంటి చేత్తో హ్యాండిల్ చేయవచ్చు. ఈ ట్యాబులో మూడు బటన్లు ఉంటాయి, పవర్‌ను ఆన్/ఆఫ్ చేసేందుకు మరియు ట్యాబుకు కుడివైపు పైభాగంలో శబ్దాన్ని పెంచేందుకు తగ్గించేందుకు మరో బటన్ ఉంటుంది. 

ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే 1024 రిజల్యూషన్‌తో 600 పిక్జల్స్‌లో నాణ్యంగా అనిపించదు. ఐతే సొంత బ్రాండ్ యొక్క పీఎల్ఎస్ ఎల్సీడి టెక్నాలజీ ప్రదర్శనను ప్రకాశవంతంగానూ, ఉత్తమమైన వర్ణసహితంగా కనబడేటట్లు చేస్తుంది.

వినియోగం :

జీబీ ర్యామ్‌తో డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ సేండ్‌విచ్‌తో ఇది పనిచేస్తుంది. ఈ ట్యాబు బ్రౌజింగ్, మల్టీ టాస్కింగ్, వీడియో హ్యాండ్లింగ్ వంటివాటిని మీకు అందిస్తుంది. 

శ్యామ్‌సంగ్ టచ్‌విజ్ కస్టమర్ ఇంటర్ఫేస్‌ను ఈ ట్యూబ్‌లో పరిచయం చేయడం జరిగింది. అడోబ్ ఫ్లాష్ మద్దతుతో ఈ శ్యామ్‌సంగ్ మొబైల్‌లో మీరు ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయవచ్చు. ఆన్‌స్క్రీన్ కీబోర్డులో మీకు కావలసిన బటన్లు కాలసిన చోట అమరి ఉంటాయి కనుక ఉపయోగించటం చాలా సులభంగా ఉంటుంది.

కెమేరా : 

ఈ ట్యాబ్ కెమేరా విషయంలో మీరు కాస్త అసంతృప్తికి గురవుతారు. ఇతర లేటెస్ట్ ట్యాబుల్లో ఉన్నటువంటి హై కెమేరా ఇందులో మీకు లభ్యం కాదు. 3.2 మెగా పిక్జల్ కెమేరాను కలిగి, వీజీఎ కెమేరా( ఫ్రంట్ ఫేసింగ్)తో ఉంటుంది.

బ్యాటరీ సమయం : 

మరీ అధికంగా ఉపయోగిస్తే తప్పించి 1400 ఎమ్ఎహెచ్ బ్యాటరీ సుమారు 8 గంటలపాటు పనిచేస్తుంది. ఇంటర్నెట్ బ్రౌజింగ్ లేదా ఇతరత్రా అప్లికేషన్లను మొదలెడితే బ్యాటరీ చార్జ్ మరింత అవసరం అవుతుంది.

చిట్టచివరి మాట : 

చూడగానే కొనేయాలనిపించే ఈ ట్యాబ్ భరించగలదిగానే ఉంటుంది. శ్యామ్‌సంగ్ ఎస్3 సృష్టించినంత ప్రభంజనాన్ని ఇది సృష్టించలేకపోయింది. ఇంకా ఇతర సమకాలీన ట్యాబ్‌లతో పోల్చి చూసినప్పుడు ఇది అత్యద్భుతంగా అనిపించకపోవచ్చు. కానీ ఈ ఫోన్ పనితీరు తృప్తికరంగా ఉంటుంది. 

శ్యామ్ సంగ్ గెలాక్సీపై స్పెషల్ ఆఫర్ల కోసం...

శ్యామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 స్పెషల్ ఆఫర్లకోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ రిలయన్స్ డిజిటల్ డాట్ ఇన్‌ను సందర్శించవచ్చు. ఇంకా ట్యాబ్ గురించి మరిన్ని వివరాల కోసం ఫేస్‌బుక్, వివిధ రకాల ఉత్పత్తుల కోసంట్విట్టర్, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం యూట్యూబ్‌లో చూసి తెలుసుకోవచ్చు.

Share with Friends :

Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger