సూపర్ స్టార్ మహేష్ బాబు గమ్యం, వేదం ఫేం క్రిష్ దర్శకత్వంలో ‘శివం' సినిమా చేయబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి మహేష్ బాబు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
డిఫరెంట్ కథాంశంతో ‘శివం' చిత్రాన్ని రూపొందిస్తున్నారని, గతంలో మహేష్ బాబు ఎన్నడూ కనిపించని విధంగా ఇందులో దర్శనం ఇవ్వబోతున్నాడని, విభిన్నమైన, విలువలతో కూడిన చిత్రాలు తీస్తాడని మంచి పేరు సొంతం చేసుకున్న క్రిష్ ఈ చిత్రం కోసం చాలా పక్బంధీ స్క్రిప్టు తయారు చేసుకున్నాడని తెలుస్తోంది.
మహేష్ బాబు తాజా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. వీటి తర్వాత క్రిష్-మహేష్ బాబు కాంబినేషన్లో ‘శివం‘ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
పూర్తి కుటుంబ కథా చిత్రం రూపొందుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం మహేష్ బాబు గత సినిమాలకు భిన్నంగా... మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ను మెప్పించేలా అన్ని చిత్రీకరిస్తున్నారు. దసరా నాటికి ఈచిత్రం ప్రేక్షుకుల తెచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు క్రిష్ ప్రస్తుతం రాణా హీరోగా ‘కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం చేస్తున్నారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment