పూరీ జగన్నాధ్ దేముడు చేసిన మనుష్యులు చిత్రంతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చిన సంగీత దర్సకుడు రఘు కుంచె. తాజాగా ఆయన మరో చిత్రం కమిటైనట్లు సమాచారం. పూరీ జగన్నాధ్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త చిత్రానికి రఘు కుంచెనే సంగీత దర్శకుడుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20న బ్యాంకాక్ లో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం. ఇందులో బన్ని సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఇద్దరు అమ్మాయిలతో అల్లు అర్జున్ చేసే అల్లరినే ప్రత్యేకంగా ఫన్ తో కలిసి పూరీ స్క్రిప్టు రెడీ చేసాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇప్పటివరకూ అల్లు అర్జున్ చేసిన సినిమాల్లో ఒక్కరే హీరోయిన్ గా ఉంటూ వచ్చారు. తొలిసారిగా అల్లు అర్జున్ సరసన ఇద్దరు హీరోయిన్స్ చేస్తున్నారు. ఈ సంవత్సరం చివరాఖరున అంటే డిసెంబర్ నెలలో ఈ చిత్రం విడుదల చేయాలని పూరీ జగన్నాధ్ పట్టుదలతో ఉన్నారు.
ఇక రఘు కుంచె సంగీతం అందించిన దేముడు చేసిన మనుష్యులు ఆడియో ఇప్పటికే మంచి విజయం సాధించింది. అలాగే...దేవుడున్నాడని మనస్పూర్తిగా నమ్మి ఈ సినిమా చూడండి అనే కార్డ్ వచ్చిన తర్వాత సినిమా స్టార్ అవుతుంది. హండ్రెడ్ పర్శంట్ ఎంటర్టైనర్ ఇది. నాకు రవితేజ కాంబినేషన్ లో చాలా మంచి హిట్ సినిమా అవుతుంది అన్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
రవితేజ,ఇలియానా కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ రూపొందించుతున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రం కాన్సెప్టు గురించి పూరీ జగన్నాధ్ చెపుతూ...దేవుడు ఎంతో మంచివాడు. అందుకే చేతులెత్తి దణ్నంపెడుతున్నాం. మరి ఆ దేవుడు చేసిన మన మనుషుల్లో మంచివాళ్లు ఎంతమంది? కర్త, కర్మ, క్రియ... అన్నీ మనమే అయినా ఆ పైవాడిపైనే భారం మోపుతూ ఎలాంటి పనులు చేస్తున్నాం? దేవుడే చేసిన ఓ యువకుడు సమాజానికి ఏం చెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంన్నారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment