పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'. యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఓవర్సీస్ రైట్స్ దక్కాయని, రూ. 5 కోట్లు చెల్లించి ఈ చిత్రం హక్కులు దక్కించుకున్నారని ఇటీవల వార్తలు వినిపించాయి. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించడం వల్లనే ఈ చిత్రం పెద్ద మొత్తంలో రైట్స్ అమ్ముడు పోయాయని, తెలుగు సినిమా చరిత్రలోనే ఓవర్సీస్ విభాగంలో ఇది అత్యధిక మొత్తమని ప్రచారం జరిగింది.
గత కొన్ని రోజుల క్రితం పరిశిలీస్తే...మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఓరవర్సీ రైట్స్ రూ. 6 కోట్లు చెల్లించి 14 రీల్స్ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ దక్కించుకుందని, అది రికార్డు స్థాయి అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
ఈ విధంగా వివిధ రకాలుగా వాదనలు వినిపిస్తుండటంతో ఏవి రైట్, ఏవి ఫేక్ అనేది అర్థం కాక అయోమయం నెలకొంది. ఇలాంటి విషయాలపై అధికారిక ప్రకటనలు చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. సినిమాల నిర్మాణం, అమ్మకాలు, కొనుగోళ్లు, వసూళ్లు అంతా చట్ట ప్రకారం జరిగే వ్యవహారమే. మరి ఆ వివరాలను పారదర్శకంగా పెడితే వీళ్లకు వచ్చిన నష్టం ఏమిటో?
సినీ పరిశ్రమలో ఇలాంటి వివరాలు రహస్యంగా ఉంచడానికి కారణం టాప్ హీరోల ఒత్తిడే కారణమని అంటున్నారు. వాటి వల్ల తమ సంపాదన వివరాలు బయట పడతాయని, ఒక వేళ సినిమా ఫట్టయితే ఆ వివరాలను పట్టుకుని మీడియా రాద్దాంతం చేస్తుందనే కారణమే సినిమాల్లో మనీ వ్యవహారం రహస్యంగా ఉంచుతున్నారనే వాదన వినిపిస్తోంది.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment