‘విండోస్ ఆధారిత ఫోన్‌ల తయారీలో నోకియా పేరుమీద ఉన్న రికార్డును సామ్‌సంగ్ తిరగరాస్తుందా అంటే…. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్‌లో సాధ్యమేనంటున్నారు విశ్లేషకులు!.’
విండోస్ స్మార్ట్‌ఫోన్ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే బ్రాండ్ నోకియా. ఈ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పని చేసే స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల కాలంలో నోకియా అత్యధికంగా డిజైన్ చేసింది. మార్కెట్లో చోటుచేసుకున్న మార్పుల నేపధ్యంలో విండోస్ ఫోన్‌లను రూపొందించేందుకు సామ్‌సంగ్ ఉవ్విల్లూరుతుంది. 2012కు గాను మూడు విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నట్లు సామ్‌సంగ్ వర్గాలు ప్రకటించాయి. వీటిలో మొదటి స్మార్ట్‌ఫోన్ ‘మండేల్ SGH-i667’. విండోస్ ఫోన్ ట్యాంగో (7.5 రీఫ్రెష్) ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది.
సామ్‌సంగ్ విండోస్ ఫోన్‌లకు సంబంధించి తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ‘Omnia M’ పేరుతో విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో యూరోప్‌లో లాంచ్ చేసేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ హ్యాండ్ సెట్ ఇండియాలో విడుదలకు సంబంధించి ఏ విధమైన ప్రకటనా లేదు. దేశీయ విపణిలో ఈ మొబైల్ ధర రూ.15,000 వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Omnia M ఫీచర్లను పరిశీలిస్తే:
విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్,
4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
5 మెగా పిక్సల్ కెమెరా,
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
384ఎంబీ ర్యామ్,
25జీబి స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్.
1గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్,
4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
5 మెగా పిక్సల్ కెమెరా,
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
384ఎంబీ ర్యామ్,
25జీబి స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment