ఫోటో కెమెరా నిర్మాణ సంస్థ ఫుజిఫిల్మ్ సరికొత్త వాటర్‌ప్రూఫ్ డిజిటల్ కెమెరాను రూపొందించింది. మోడల్ ఫైన్‌పిక్స్ FP170. కొత్త జనరేషన్ ఫోటోగ్రఫీ విభాగంలో రాణించాలనుకునే యువతకు ఈ కెమెరా ఉత్తమ ఎంపిక. వైర్‌లెస్ ఫీచర్ ఆధారంగా ఈ డివైజ్‌లోని ఫోటోలను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దుమ్ము, చమ్మ, వేడి వంటి ప్రతికూల పరిస్ధితులను ఫైన్ పిక్స్ FP170 సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.
కెమెరా ప్రధాన ఫీచర్లు:
14 మెగా పిక్సల్ కెమరా సెన్సార్,
వాటర్ ప్రూఫ్ (33ఫీట్),
వైర్‌లెస్ ఇమేజ్ ట్రాన్సఫర్,
షాక్‌ఫ్రూఫ్ (6.5 అడుగులు),
ఫ్రీజ్‌ప్రూఫ్ (14డిగ్రీలు వరకు),
వీడియో రికార్డింగ్ సౌలభ్యత.
వాటర్ ప్రూఫ్ (33ఫీట్),
వైర్‌లెస్ ఇమేజ్ ట్రాన్సఫర్,
షాక్‌ఫ్రూఫ్ (6.5 అడుగులు),
ఫ్రీజ్‌ప్రూఫ్ (14డిగ్రీలు వరకు),
వీడియో రికార్డింగ్ సౌలభ్యత.
ఈ హై క్లారిటీ కెమెరా ఫోటోలను ఉత్తమ క్వాలిటీతో చిత్రీకరిస్తుంది. డివైజ్ 33 అడుగుల లోతైన నీటిలో పడినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. మరో షాక్‌ప్రూఫ్ వ్యవస్ధ కెమెరా 6 అడుగుల పై నుంచి కిందపడినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. కెమెరాలో దోహదం చేసిన వైర్‌లెస్ ఇమేజ్ అప్లికేషన్‌తో కెమెరాను ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సౌలభ్యతతో ఫోటోలతో పాటు వీడియోలను వైర్ల సాయం లేకుండా షేర్ చేసుకోవచ్చు. ధర అంచనా రూ.15,000 విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫుజిఫిల్మ్ JZ100:
ఫోటో కెమెరాల తయారీ సంస్థ ఫుజిఫిల్మ్ కొత్తశ్రేణి లోబడ్జెట్ డిజిటల్ కెమెరాలను భారత్‌లో విడుదల చేసింది. పేరు ఫుజిఫిల్మ్ JZ100. ముందుగా డివైజ్‌లోని ఫీచర్లను పరిశీలిద్దాం…. 129 గ్రాముల బరువు, 13.8 మెగా పిక్సల్ సీసీడి సెన్సార్, 2.7″ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 720 పిక్సల్ హై డెఫినిషన్ మూవీ షూట్, 8xజూమ్, 8x ఆప్టికల్ జూమ్ లెన్స్, బుల్ట్-ఇన్ ఫ్లాష్, షూటంగ్ రేట్ (1.2 fps), కాంట్రాస్ట్ డిటెక్షన్ ఆటో ఫోకస్, ఫేస్ డిటెక్షన్, హై డెఫినిషన్ మూవీ రికార్డింగ్(720p @ 30fps), ఐఎస్‌వో (100 – 3200*3), ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆరు కలర్ వేరియంట్స్, కెమెరా మెమరీని పెంచుకునేందుకు SDXC / SDHC / SD కార్డ్ స్లాట్స్, ఎస్‌ఆర్ ఆటోమోడ్, 26ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్, ధర 9,000.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment