ఇటీవలే ఓ కొత్త హీరోయిన్ తెలుగు ఇండ్రస్టీకి పరిచయమైంది. నిర్మాత ఎం.ఎస్.రాజు కుమారుడు అశ్విన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆమెను తీసుకున్నారు. ఆల్‌రెడీ ఎం.టీవీ వీడియో జాకీగా పేరు పొందిన రియాకు 'తూనీగ తూనీగ'లో ఛాన్స్ ఇచ్చారు. ఈ హీరోయిన్ కోసం చాలాకాలం ఎదురు చూశారు. ఆఖరికి ఈమె దొరికింది.
కొత్తవారైతేనే హీరోకు సూటబుల్ అనీ, అప్పట్లో రామ్ సరసన ఇలియానా దేవదాసులో నటించి క్రేజ్ సంపాదించుకుంది. అలాంటి క్రేజ్ ఈమెలో ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. షూటింగ్‌లో చాలా గ్లామర్‌గా సెక్సీగా కన్పించిందని వార్తలు విన్పిస్తున్నాయి. వాటితోపాటు మంచి పాత్ర కూడా దొరకడంతో తెలుగులో మంచి అవకాశాలు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయని అంటున్నారు.
Post a Comment