వీధి కుక్కలను చూస్తే త్రిష హృదయం కరిగిపోతుందట
వీధుల్లో అనాధల్లా తిరిగే వీధి కుక్కులను చూస్తే తన హృదయం కరిగిపోతుందనీ, వాటన్నిటికీ షెల్టర్ ఇవ్వాలని అనిపిస్తుందని అంటోంది బక్కపలుచని భామ త్రిష. హైదరాబాదులో జరిగిన బ్లూ క్రాస్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి త్రిష హాజరైంది. అక్కడే ఉన్న ఓ నల్ల కుక్కను ఎత్తుకుని ప్రేమగా హృదయానికి హత్తుకుంది. నోరు లేని మూగజీవాల ఆలనాపాలనా చూడాల్సిన బాధ్యత పౌరులపై ఉన్నదని చెప్పుకొచ్చింది. రోడ్లపై తిరిగే వీధికుక్కల్ని అలా అనాధ కుక్కలుగా వదిలేయకుండా కనీసం ఒక్కో కుటుంబం ఒక వీధి కుక్కను సాకాలని పిలుపునిచ్చింది ఈ బ్యూటీ. మరి త్రిష ఎన్ని వీధి కుక్కలను సాకుతుందో మరి...
Post a Comment