మోహన్ బాబు నుంచి మెగా కుటుంబంలోని వారికి పిలుపా...! ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజం. కొత్తగా పెళ్లయిన రామ్ చరణ్-ఉపాసనలను తమ ఇంటికి డిన్నర్‌కు రావాల్సిందిగా మోహన్ బాబు ఆహ్వానించారు. ఇటీవల జరిగిన మాటీవీ అవార్డుల ఫంక్షన్లోనే మోహన్ బాబు చిరంజీవికి ఈవిషయం చెప్పారట. మోహన్ బాబు స్వయంగా పిలవడంతో చిరంజీవి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చరణ్, ఉపాసన మూడు రోజుల హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇటీవల తిరుపతి వెంకన్నను దర్శించుకున్న అనంతరం నేరుగా వాటికన్ సిటీకి వెళ్లారు. అక్కడ సెంయింట్ పీటర్స్ చర్చిని సందర్శించారు. మూడు రోజులు ఎంజాయ్ చేశాక వారు తిరిగి ఇండియాకి రానున్నారు. వచ్చిన వెంటనే చెర్రీ సినిమా షూటింగుల్లో బిజీ కానున్నారు.
సినీ పరిశ్రమలో చాలా రోజుల నుంచి చిరంజీవి, మోహన్ బాబుల మధ్య ఆధిపత్య పోరు ఉందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. పలు సందర్భాల్లో వీరు పిల్లి ఎలకల్లా పోట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతెందుకు తాము టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్లమని చిరంజీవి కూడా ఆ మధ్య ఒక సందర్భంలో ఒప్పుకున్నారు కూడా.
అయితే ఎవరికీ అర్థంకాని విధంగా పలు సందర్భంల్లో చాలా ఆప్యాయంగా ఉంటారు చిరంజీవి, మోహన్ బాబు. ఇటీవలరామ్ చరణ్ పెళ్లి వేడుకలో కూడా మోహన్ బాబు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఇప్పుడు తాజాగా మోహన్ బాబు చరణ్-ఉపాసనలను డిన్నర్‌కి ఆహ్వానించడంతో ఇరు కుటుంబాల మధ్య బంధం బలపడుతోందని అంటున్నారంతా.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment