నాగచైతన్య సరసన హన్సిక త్వరలో నటించబోతోందని సమాచారం. నాగచైతన్య, సునీల్ కలిసి చేయబోతున్న వెట్టై రీమేక్ చిత్రంలో నాగచైతన్య సరసన ఆమెను ఎంపిక చేసారు. సునీల్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం వేట సాగుతోంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రాన్ని రూపొందించిన డాలీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. తమిళంలో లింగు స్వామి డైరక్ట్ చేసిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. యాక్షన్,ఎంటర్టనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఇక హన్సిక తెలుగులో బెల్లంకొండ సురేష్ గతం చిత్రం కందిరీగ లో చేసింది. రామ్ హీరోగా చేసిన ఈ చిత్రం మంచి విజయం సాధించినా ఆమెకు ఆఫర్స్ ఏమీ రాలేదు. తమిళంలో బిజీగా ఉన్న ఆమె..దిల్ రాజు.. నిర్మించిన ఓహ్ మై ప్రెండ్ లో.. సిద్దార్ధ సరసన చేసింది. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. ఒళ్లు బాగా పెరిగి పోయిన తమిళనాట చిన్న ఖుష్బూ అని పేరు తెచ్చుకుంది. దాంతో అక్కడే ఆమెను బాగ ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుగులో ఆమె సరసన యంగ్ హీరోలు చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. సీనియర్ హీరోల ప్రక్కన ఆమె చేయటానికి ఇంట్రస్ట్ చూపటం లేదు.
తమిళంలో హిట్టైన ‘వెట్టై’చిత్రం రైట్స్ ని యు.టీవి వారి వద్దనుంచి బెల్లంకొండ రైట్స్ తీసుకున్నారు. మాధవన్, ఆర్య, సమీరారెడ్డి, అమల పాల్ ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన ‘వెట్టై’ మంచి విజయం సాధించింది. తెలుగు వెర్షన్ జూన్ 26నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. నాగచైతన్య ...తమ్ముడుగా కీ క్యారెక్టర్ ని చేస్తూండగా,సునీల్ ..సెకండ్ హీరో పాత్రను చేస్తున్నారు. తమిళంలో ఆర్య..పాత్రను నాగచైతన్య,మాధవన్ పాత్రను సునీల్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని మొదట తెలుగులో ‘భలే తమ్ముడు’గా అనువదించటానికి ప్రయత్నాలు చేసారు. మాధవన్-ఆర్యలకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇక్కడ కూడా మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశించారు.అందులోనూ గతంలో వచ్చిన ‘రన్’, ‘పందెం కోడి’, ‘ఆవారా’ చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగు స్వామి ఈ చిత్రానికి దర్శకుడు కావటంతో క్రేజ్ వచ్చింది. అయితే తెలుగులో డబ్ చేయటం కన్నా రీమేక్ చేస్తేనే ఫలితాలు బాగుంటాయని బెల్లంకొండ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వెట్టై చిత్రం యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్ సమాహారంతో రూపొందింది. ఈ చిత్రంలో మాధవన్, ఆర్య నటన, సమీరారెడ్డి, అమలాపాల్ అందచందాలు, అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే యువన్ సంగీతం పెద్ద ఎస్సెట్ అయింది. ప్రస్తుతం లింగు సామి దర్శకత్వంలోనే హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. హిందీ వెర్షన్ కి షాహిద్‌కపూర్ హీరోగా నటించనున్నారు. ఇతర నటీనటుల సంగతి తెలియాల్సి ఉంది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment