బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి తెరకెక్కిస్తున్న చిత్రం 'అధినాయకుడు'. ఈ చిత్రం చాలా కాలంగా ఎప్పుడు రిలీజా అని అందరినీ ఊరిస్తోంది. మొత్తానికి ఈ చిత్రాన్ని ఈ నెల 31 విడుదల చేయటానికి తేదిని ఫిక్స్ చేసారని సమాచారం. అయితే 30న రాజమౌళి ఈగ చిత్రం విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఏ చిత్రం ఎవరికి పోటి అవుతుందనే విషయం చర్చనీయాంసమైంది. ఒక్క రోజు తేడాలో రెండు పెద్ద చిత్రాలు రిలీజు అయితే ధియోటర్స్ సమస్య మాత్రమే కాక రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఆ ఎఫెక్టు కలెక్షన్స్ మీద కూడా పడుతుందని అంటున్నారు. అయితే 'అధినాయకుడు'ఇంకా లేటు చేసే అవకాసం లేదని అంటున్నారు.
'అధినాయకుడు' చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... బాలకృష్ణ అభిమానలుకు మాత్రమే కాక అందరికీ నచ్చే చిత్రం ఇది అన్నారు. అలాగే... కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ...నాయకత్వం వ్యాపారం కాదు... వారసత్వంగా రావటానికి. వెనకనున్న పదిమంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాలి. అప్పుడే నాయకుడు అవుతాడు. అలాంటివాళ్లు మాత్రమే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొంటారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమై నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న ఓ కుటుంబం కథే మా చిత్రం అంటున్నారు.
“ ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు.గతంలో చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన బాలయ్య అధినాయకుడులో మరోసారి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్ కుమార్‌చౌదరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆరు పాటలు సహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment