.
Home » » 'గబ్బర్ సింగ్' పై రామ్ చరణ్ కామెంట్

'గబ్బర్ సింగ్' పై రామ్ చరణ్ కామెంట్

Written By Hot nd spicy on Thursday, 17 May 2012 | 11:11

మెగాభిమానులు ఎదురు చూస్తున్న ట్వీట్ వచ్చేసింది. అదే రామ్ చరణ్ ..గబ్బర్ సింగ్ గురించి కామెంట్ చెయ్యటం. క్రితం శుక్రవారం విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ ఈ చిత్రం గురించి ఏం చెప్తాడా అని ఎదురుచూసారు. కొందరైతే అత్యుత్సాహంగా రామ్ చరణ్ కావాలనే ఈ చిత్రం గురించి సైలెంట్ గా ఉన్నాడని కథనాలు సైతం వెలువరించేసాడు. దాంతో పవన్ ఇండియాకి రాగానే మొదట ఈ చిత్రం గురించి కామెంట్ చేస్తూ ట్వీట్ చేసాడు.

రామ్ చరణ్ రాసిన ట్వీట్ లో..."మా ఫ్యాన్స్ కి పండగ. చాలా ఆనందంగా ఉంది పవర్ బాబాయ్ గబ్బర్ సింగ్ ఎమేజింగ్. నేను 18న ఇండియాకు వచ్చాను. ఇంక సినిమా చూడకుండా ఉండలేకపోయాను. ఈ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్" అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పవన్ అభిమానులకే కాక మెగా అభిమానుల మొత్తానికి ఆనందం కలిగించింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ మూడు చిత్రాల షూటింగ్ లలో బిజీగ ఉన్నారు.

అవి వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినికిడి. ఆకుల శివ కథకు వినాయిక్ అద్బుతమైన స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని మాస్ కి నచ్చేలా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం యాభన్ ఎపిసోడ్స్ తో షూటింగ్ మొదలైంది. రెండో షెడ్యూల్ త్వరలో జరగనుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ నటిస్తోంది.

అలాగే రామ్ చరణ్ హిందీ జంజీర్ లో నటిస్తున్నారు. అమితాబ్ జంజీర్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అపూర్వ లఖియా డైరక్ట్ చేస్తున్నాడు. ఈ కాలనికి తగినట్లుగా ఆయిల్ మాఫియా నేపధ్యంలో ఈ చిత్రం కథని మార్చి రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా చేస్తోంది. ఈ చిత్రాలతో పాటు మరోప్రక్క వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు చిత్రం చేస్తన్నాడు. అల్లు అర్జున్ గెస్ట్ రోల్ లో కనపించే ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది. యాక్షన్ తో కూడిన విభిన్నమైన చిత్రగా దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger