‘డర్టీ పిక్చర్’ రీమేక్ లో నయనతార నటించనుందంటూ వచ్చిన వార్తలపై నయనతార మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఈ విషయంపై వచ్చిన వార్తలన్నిటినీ కొట్టిపారేసింది. అలాగే తనకు రెండున్నర కోట్లు రెమ్యునేషన్ ఆఫర్ చేయటం, విద్యాబాలన్ లా బరువు పెరగమనంటం అన్నీ మీడియా క్రియేట్ చేసిన రూమర్సే అని అంది. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఆమె మాటల్లో...‘డర్టీ పిక్చర్’ రీమేక్ లో చేస్తున్నానంటూ వచ్చిన వార్తలన్నీ ఆధారం లేనివే. ఆ చిత్రం రీమేక్‌లో నటించమని నన్నెవరూ అడగలేదు. నేను‘డర్టీ పిక్చర్’ చిత్రం చూశాను. చిత్రం చాలా బాగుంది . అయితే ఈ చిత్రంలో నటించే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే ఈ పాత్ర పోషణ నాకంత సౌకర్యవంతంగా అనిపించదు...''వ్యక్తిగతంగా నాకు 'డర్టీ పిక్చర్' సినిమా చాలా బాగా నచ్చింది. విద్య నటన బాగుంది. ఆ సినిమా దక్షిణాది భాషలకు సరిపడదు. సిల్క్‌స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకొన్నా మన ప్రేక్షకులు హర్షించరేమో? అలాగే ఆ పాత్ర పోషణ నాకు అంత నప్పదు. పారితోషికం కాదు కదా... ఇప్పటి వరకూ ఆ సినిమా చెయ్యమని కూడా నన్నెవ్వరూ సంప్రదించలేదు'' అని నయనతార స్పష్టం చేశారు.
'ద డర్టీ పిక్చర్' రీమేక్‌లో నయనతార నటించబోతోందా అంటూ దక్షిణాది చిత్ర వర్గాల్లో కొద్ది రోజులుగా ఈ విషయమ్మీద చర్చ సాగుతోంది. విద్యాబాలన్ పోషించిన పాత్రలో నయనతార నటించేందుకు ఒప్పుకొందనీ, ఆ చిత్రం కోసం నయన్ బరువు కూడా పెరుగుతోందనీ అన్నారు. ఈ చిత్రంలో నటించడానికి నయనతార రెండున్నర కోట్ల రూపాయలు పారితోషికం డిమాండ్ చేశారనే వార్త కూడా వినిపించింది. హిందీ చిత్రాన్ని నిర్మించిన ఏక్తాకపూరే దక్షిణాదిన ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారనే టాక్ కూడా ఉంది.
ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున,దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటైంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. బాలకృష్ణ కూడా తను డైరక్ట్ చేద్దామనుకున్న నర్తన శాలలో ఆమెను హీరోయిన్ గా అడుగుతున్నాడు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment