.
Home » » ‘ఈగ’ టార్గెట్ కేవలం 30% రికవరికేనా?

‘ఈగ’ టార్గెట్ కేవలం 30% రికవరికేనా?

Written By Hot nd spicy on Tuesday, 22 May 2012 | 09:46

రాజమౌళి తాజా చిత్రం ‘ఈగ’ఈ నెల 30న విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాజమౌళికున్న క్రేజ్ తో భారీగా బిజినెస్ జరిగిందని వినికిడి. దానికి తోడు తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్,డబ్బింగ్ రైట్స్,ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్నీ కలిసి 70% దాకా ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడిలో రికవరి అయ్యిపోయిందంటున్నారు. అందులోనూ చాలా ఏరియాలకు NRA బేసిస్ న రైట్స్ అమ్మారని తెలుస్తోంది. దాంతో నిర్మాతకు ఎట్టి పరిస్దితుల్లోనూ నష్టమెచ్చే అవకాసం లేదు. NRA అంటే..నాన్ రిటన్ బుల్ అడ్వాన్స్ అని. దాంతో ఒక వారం రోజులు పాటు ఈగ గట్టిగా ఏ పోటీ లేకుండా అడితే చాలు అని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.

ఈ చిత్రాన్ని తమింళంలో ‘నాన్ ఈ’ టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్ శాటిలైర్ రైట్స్ ఓ రేంజిలో పలికి అందరికీ షాక్ ఇచ్చింది. తమిళంలో నెంబర్ వన్ ఛానెల్ అయిన సన్ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని 3.35 కోట్లుకు కొనుగోలు చేసారు. ఓ తెలుగు డైరక్టర్ డైరక్ట్ చేసిన చిత్రానికి ఈ రేంజి రేటు పలకటం తమిళ శాటిలైట్స్ హిస్టరీలోనే ఓ పెద్ద రికార్డు అంటున్నారు. నాని, సమంత హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను పీవీపీ సినిమా నిర్మిస్తోంది.

ఇక రాజమౌళి ఈగని బైలింగ్వల్ గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. మీడియాలో ఈగ చిత్రాన్ని నాన్ ఈ అనే టైటిల్ తో తమిళంలో డబ్బింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ మాట్లాడారు.ఆయన మాటల్లోనే...ఈగలోని ప్రతీషాట్ ని తెలుగు,తమిళ భాషల్లో సెరపేట్ గా చిత్రీకరించాము. నాన్ ఈ ఆనే చిత్రం తమళ డబ్బింగ్ వెర్షన్ కాదు. అది బైలిగ్వల్. ఇక హిందీలలో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాము. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర జరుపుకుంటోంది. ఈ 30న విడుదల చేస్తాము అన్నారు.

సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. తెలుగు వెర్షన్ కి సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘ఈగ’ సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే ‘తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ ‘ఈగ’ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ ఈగ’ కథాంశం.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger