రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' వచ్చే నెల ఆరవ తేదీన ప్రపంచమంతటా 1200 ప్రింట్లతో విడుదల అవుతోంది. అలాగే ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, మళయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. కానీ కర్ణాటక వెర్షన్ మాత్రం విడుదల చెయ్యటం లేదు. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఈ చిత్రంలో కీ రోల్ చేస్తున్న సమయంలో కన్నడ వెర్షన్ లేకపోవటం ఇప్పుడు చర్చకు దారి తీసింది. అయితే కన్నడంలో డబ్బింగ్ సినిమాలు నిషేధం. కానీ సైమన్టేనిస్ గా కన్నడంలో చిత్రీకరించామని స్టైయిట్ సినిమాగా విడుదల చేయొచ్చు.
కానీ అలా రాజమౌళీ ఈ 'ఈగ'ని తమిళ, మళయళ భాషల్లో స్టైయిట్ సినిమాగా విడుదల చేస్తున్నారు కానీ కన్నడకి ఆ అవకాశం ఇవ్వలేదు. దానికి కారణం.. కన్నడంలో సుదీప్ కి ఉన్న పాపులారిటి అంటున్నారు. అక్కడ సూపర్ స్టార్ గా వెలుగుతున్న సుదీప్.. ఈ చిత్రంలో విలన్ గా చేయటంతో ఆపుచేసారంటున్నారు. హీరో పాత్రలు చేసే సుదీప్ కి ఈ చిత్రం అక్కడ నెగిటివ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందని భయంతో రిలీజ్ వద్దన్నాడని చెప్పుకుంటున్నారు.
సినిమా మొదలైన అరగంటకే హీరో చనిపోతాడు. అయితే అతను ఈగ రూపంలో విలన్‌పై ఎలా పగ సాధించాడు అనేది సస్పెన్స్ అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఆయన తాజా చిత్రం 'ఈగ' త్వరలో విడుదల కానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగ'. తుది మెరుగులు దిద్దుకుంటోంది. నాని, సమంత, సుదీప్ కీలక పాత్రధారులు. వారాహి చలనచిత్రం పతాకంపై తెరకెక్కుతోంది.
అలాగే రాజమౌళి మాట్లాడుతూ "బలవంతుడైన విలన్, బలహీనమైన ప్రాణి చేతిలో ఎలా ఓడిపోయాడు? ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అనే అంశం చుట్టూ తిరిగే కథే 'ఈగ'. సంక్షిప్తమైన ఈ కథను నాని, సమంత, సుదీప్ అర్థం చేసుకుని చక్కగా నటించారు. చక్కటి ప్రేమ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి'' అని అన్నారు. 'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగ ని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం. తెలుగు, తమిళం, మళయాళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment