జూ.ఎన్టీఆర్ తో పూరీ జగన్నాధ్ చేయాల్సిన చిత్రం ప్లేస్ లోకే అల్లు అర్జున్ వచ్చి ఫిక్స్ అయ్యారు. ఎన్టీఆర్ తాను హరీష్ శంకర్ తో చిత్రం చేయటానికి కమిటవటంతో డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేని సిట్యువేషన్ ఏర్పడింది. దాంతో పూరి వెంటనే తన వ్యూహం మార్చుకుని అల్లు అర్జున్ కి కథ చెప్పుకుని ఓకే చేయించుకున్నారు. ఇక ఎన్టీఆర్,పూరీ జగన్నాధ్ సినిమా వచ్చే సంవత్సరమే అంటే 2013 కి వెళ్లిపోయింది.
శ్రీను వైట్ల దర్సకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే చిత్రం జూలై 1 నుంచి షూటింగ్ మొదలయ్యి కంటిన్యూగా జరగనుంది. ఆ తతర్వాత అక్టోబర్ నుంచి హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందే ఎమ్.ఎల్.ఎ చిత్రం ప్రారంభమవుతుంది. దాంతో పూరీ తో చేయటానికి డేట్స్ ఇవ్వలేని సిట్యువేషన్ వచ్చింది. మరో ప్రక్క పూరి సైతం వరస ప్రాజెక్టులతో తనను తాను బిజీ చేసుకుంటున్నారు. దేముడు చేసిన మనుష్యులు విడుదలకు రెడీ అవుతూంటే మరో ప్రక్క కెమెరామెన్ గంగతో రాంబాబు మొదలెట్టారు.
ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘బాద్‌షా' చిత్రం రెగ్యులర్ షూటిం ఇటలీలో మొదలుకానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత బండ్ల గణేష్‌బాబు తెలియజేస్తూ‘ యాక్షన్‌తో అంశాలతో పాటు ఓ అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో వుంది. ఈ చిత్రంలో శ్రీనువైట్ల కొత్త ఎన్టీఆర్‌ను చూపించబోతున్నాడు. ఆయన ఇమేజ్, శారీరక భాషకు సరిగ్గా సరిపోయే కథ అన్నారు.
అలాగే ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఆశిస్తున్న అంశాలు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇంతకు ముందు ‘అదుర్స్' చిత్రంలో తన కామెడీ టైమింగ్‌తో అందర్నినవ్వించిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రేక్షకులను మరింతగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రను ఆయన ఇందులో చేస్తున్నాడు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ మెప్పు పొందుతుందనే విశ్వాసం వుంది' అన్నారు
Share with Friends : |
Share with Friends : |
Post a Comment