రాజమౌళి ఈగను చూసి సెన్సార్ సభ్యులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారట. ఈగ సినిమా సెన్సార్ కోసం వెళ్లింది. ఈగను ఆసాంతం చూసిన సభ్యులు, సినిమాలో ఎక్కడా చిన్న కత్తెర కూడా వేయకుండా యు సర్టిఫికేట్ ఇచ్చారు.
రాజమౌళి ఈగను తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకున్నారట. సెన్సార్ సభ్యులకే ఈగ మోతపుట్టించిందంటే ఇక ప్రేక్షకులకు ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందోనని ఈగ యూనిట్ సంబరపడిపోతోంది.
కాగా ఈ చిత్రాన్ని వచ్చే నెల 6వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్‌తో ఆలస్యమవుతుందేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment