12 రోజులు పాటు నిద్ర హారాలు లేకుండా గడిపి తన గెటప్ లో ఛేంజ్ తీసుకువచ్చి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు కిక్ శ్యామ్. ఆయన తన తాజా చిత్రం సిక్స్ (6)కోసం ఈ ప్రయోగం చేసారు. విజె దురై దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు తమిళ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఇందుకోసం కిక్ శ్యామ్ ...89 కేజీల బరువు నుంచి 72 కేజీలు బరువు తగ్గారు. గెడ్డం,జుట్టు పెంచి చాలా విచిత్రంగా రెడి అయ్యారు. కళ్లు ఉబ్బిబోయి, జుట్టు పిచకలు కట్టి ఈ గెటప్ ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కోలీవుడ్ లో విక్రమ్ తరహాలో విచిత్ర గెటప్ పేలుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం గెటప్ బయిటకు రాగానే మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడటంతో బిజినెస్ లో సైతం క్రేజ్ వస్తోందని అంటున్నారు.
ఇక హీరో శ్యామ్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పగానే ఛాలెంజ్ గా తీసుకుని హోమ్ వర్క్ చేసి మరీ సెట్స్ కు వచ్చేవారు. అలాగే ఈ పన్నెండు రోజల శ్రమ సినిమాను ఎక్కడికో తీసుకుపోతుందని భావిస్తున్నారు. ఈ గెటప్ మొదటి సారి చూసిన దర్శకుడు దొరై సైతం షాక్ అయ్యారు. వెంటనే ఆ సీన్స్ ని తెరకెక్కించి దర్శకుడు హీరోని...తిరిగి ఆయన పాత లుక్ కి రమ్మని అడిగారు. అదృష్టవశాత్తు వారం రోజుల్లో తిరిగి యధారూపానికి వచ్చాడని చెప్తున్నారు.
ఈ విషయమై శ్యామ్ మాట్లాడుతూ..రజనీకాంత్,కమల్ హాసన్ ల ప్రేరణతో ఈ గెటప్ నేను చెయ్యగలిగాను. రోబో కోసం రజనీసార్ చేసిన రిస్కీ ఫైట్స్ చూసి షాక్ అయాయాను. దశావతారంలో కమల్ హాసన్ పదిగెటప్ లలో డిఫెరెంట్ గా కనిపించటం ఆశ్చర్యపరిచింది. అవే నన్ను ఈ పాత్రలో ఒదిగిపోయేలా చేసింది అన్నారు. నా కెరీర్ లో ఈ సిక్స్ చిత్రం ఓ ఢిఫెరెంట్ గా మిగిలిపోతుందని భావిస్తున్నా అన్నారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment