కృష్ణంరాజు... ఈ పేరు వినగానే 'రెబల్‌స్టార్' గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆ బిరుదును యంగ్ రెబల్‌స్టార్‌గా ఆయన వారసుడు ప్రభాస్‌కు దక్కింది. అసలు ఈ బిరుదులు ఎలా వస్తాయి..? ఎవరిస్తారు...? అనే విషయాలతోపాటు ఈనెల 20న పుట్టినరోజు జరుపుకోనున్న కృష్ణంరాజు.... భవిష్యత్ కార్యాచరణను గురువారంనాడు ఈ విధంగా వెల్లడించారు.
మీకు రెబల్‌స్టార్ అనే పేరు ఎలా వచ్చింది?
ఫ్యాన్స్ కోసమే పుట్టినరోజు జరుపుకునేది. అప్పట్లోనే నా పుట్టినరోజున టి.నగర్ జామయ్యేది. పోలీసులకు ఆ రోజు నా పుట్టినరోజు అనేది తెలిసేది. ఇదంతా జరుపుకోవడానికి కారణం.. వాళ్ళని ఒక పద్ధతిగా తేవడానికే. శాస్త్రి అనే జర్నలిస్టు వాళ్ళను ఎడ్యుకేట్ చేసి ఫ్యాన్స్ ఇలా ఉండాలి. ఇటువంటి సామాజిక పనులు చేయాలి.. అప్పుడే మీ హీరోకు పేరు వస్తుందని గైడ్ చేసేవారు. అసలు దండలు కూడా వేసుకునేవాడ్ని కాదు. దాని ఖర్చు ఆసుపత్రిలో పేషెంట్లకు ఖర్చు చేస్తే హ్యాపీగా ఫీలయ్యేవాడిని.
నా సంగతి తెలిసి... నా ఫ్యాన్స్.. అప్పట్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కార్యక్రమాలు చేసేసి ఆ తర్వాత నాకు చెప్పేవారు... అట్లా నేను సినిమాలో చేసిన పాత్రలనుబట్టి, బయట ఫ్యాన్స్ చేసే కార్యక్రమాలనుబట్టి.. అప్పట్లో శ్రీనివాస్ అనే జర్నలిస్టు.. 'రెబల్' అనే పేరు పెట్టడం జరిగింది. అప్పటినుంచి ఆ బిరుదు అలా ప్రచారంలోకి వచ్చింది. బాలీవుడ్‌లో శతృఘ్నసిన్హాను రెబల్‌స్టార్ అంటారు. కన్నడలో అంబరీష్‌కు 'కర్ణుడు' అనే అర్థం వచ్చే బిరుదుంది. ఆ తర్వాత ఆయన రెబల్ బాగుందని దాన్ని పెట్టేసుకున్నారు. చాలాసార్లు... నా దగ్గరనుంచి తీసుకున్నానని చెబుతుండేవారు.
మీ పుట్టినరోజున తీసుకునే కొత్త నిర్ణయాలు?
ఈ ఏడాది పాలిటిక్స్‌లో ఎంటరవుతున్నాను. మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోవాలి. గతంలో రెండేళ్ళు నాకు నేనే దూరంగా ఉండాలని శిక్ష విధించుకున్నాను. ఆ కారణాలు మీకు తెలిసే ఉంటుంది.
సినిమాపరంగా ఏమైనా నిర్ణయాలు?
ఈ ఏడాది దర్శకత్వం చేస్తున్నా... అందులో నేనుకూడా నటిస్తున్నా.
ఎటువంటి తరహా చిత్రమవుతుంది?
ఇది సొసైటీలో కరెప్షన్‌కు సంబంధించి... రోజూ పేపర్లో ఎన్నో కొత్త కొత్త కుంభకోణాలు చూస్తున్నాం. మనకు స్వాతంత్య్రం రాక ముందు... బ్రిటీష్‌వారు చేసిన అవినీతికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్య్రాన్ని పొందాం. కానీ మళ్ళీ అటువంటి పోరాటానికి అందరూ సన్నద్ధం కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందులో ఏమాత్రం అసత్యం లేదు.
పరిస్థితులు మారిపోయాయి.. ఎవరూ నిక్కచ్చిగా లేరు. మీరు నిక్కచ్చిగా ఉంటే.. మీ పిల్లల్ని చదివించాలంటే స్కూల్లో డొనేషన్ కట్టాలి. ఇలా ఎన్నో ఉదాహరణలు మన చుట్టూనే ఉన్నాయి. ఎవర్ని తప్పుగా భావించాలి. ఇలా సమాజంలో జరిగే సంఘటనలతో నేపథ్యంలో కరెప్షన్‌పై చిత్రం తీస్తున్నాం. కొద్దిరోజుల్లో ఆ వివరాలు తెలియజేస్తాను.
డబ్బింగ్ సినిమాల కట్టడికి నిర్మాతగా, నటుడిగా మీ అభిప్రాయం ఏమిటి?
అజీర్తివాడికి వేరే వాడు అన్నం తింటుంటే ఏడుపు వచ్చినట్లుగా ఉంది. అసలు దీనికంటే పెద్ద సమస్య ఒకటుంది దాని గురించి ఆలోచించాలి.
ఏమిటది?
వ్యాట్... సినిమాకు సంబంధించి టాక్స్‌లు నిర్మాత కడుతున్నారు. కానీ ఒకే ఒక్క టాక్స్ పక్క రాష్ట్రంలో లేనిది మన రాష్ట్రంలోనే ఉంది. ఇది ప్రతి నిర్మాతకు తెలుసు. ఈ విషయమై ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తగు చర్యలు తీసుకోవాలి. ఓసారి మీటింగ్‌కు నేను వెళ్ళాను. టాక్స్ వల్ల నష్టాలు ఎలా ఉంటాయి? అనేది మాట్లాడాను. కానీ నేను మాట్లాడింది ఎవరికీ అర్థంకాక ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ఒక నిర్మాతకు టాక్స్‌లు కట్టడం వల్ల లక్షల రూపాయలు లాస్ అవ్వాల్సి వస్తుంది.
అది వదిలేసి... కార్మికుడికి రూపాయి బేటా ఎందుకివ్వాలి? భోజనాల్లో నాన్‌వేజ్ ఎందుకు పెట్టాలి? అనే చిన్నచిన్న విషయాలను భూతద్దంలోంచి చూసి... పెద్దవి పట్టించుకోవడంలేదు. ఇదంతా బాగుపడాలంటే... మీటింగ్‌లో... లాయర్‌ను, ఆడిటర్‌ను పిలిచి... వారికి వివరంగా చెప్పి.. వారి నిర్ణయం మేరకు ఇలా చేస్తే బాగుంటుందని... ఒక పద్ధతి ప్రకారం... కాగితాలపై రాసుకుని...దాన్ని సి.ఎం. దృష్టికి తీసుకెళితే... ఆయన వెంటనే.. ఇదేదో చూడండని చెబుతారు.
అలాకాకుండా... ఇష్టం వచ్చినట్లు ఎవరికివారు మీటింగ్‌లో మాట్లాడేస్తారు.. ఎవరికీ ఏమీ తెలియదు.. ఏదేదో మాట్లాడి కాలక్షేపం కబుర్లుగా టైమ్‌పాస్ చేస్తున్నట్లుంది. నాకు తెలిసి... ప్రొడ్యూసర్ కౌన్సిల్ కమిటీలో... అంతా రిటైర్ అయిన నిర్మాతలే... ప్రజెంట్‌గా సినిమాలు చేసే నిర్మాతలే లేరు. దీనివల్ల సమస్య ఎలా పరిష్కారమవుతుంది.
'రెబల్' సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
రెబల్‌గానే ఉంటుంది. ఫాదర్ పాత్ర. ఆ పాత్రకు దర్శకుడు లారెన్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఓసారి పబ్లిక్‌లో షూటింగ్ జరుగుతుంటే... అంతా చాలా మెచ్చుకున్నారు. దీంతో నాలో తెలీని ఎనర్జీ వస్తుంది.
మీ డ్రీమ్ ప్రాజెక్ట్ 'విశాల నేత్రాలు' ఏమైంది?
ఉంటుంది. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాను. ఎందుకంటే... ఆ సినిమాకు రూ.45 కోట్లు బడ్జెట్ అవుతుంది. నేను ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ ఇప్పటికి చాలా ఖర్చు పెరిగింది... అంటూ తెలిపారు.

Post a Comment