2014 ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానని యువరత్న బాలకృష్ణ చెప్పారు. పార్టీ ఎక్కడ పోటీ చేయమని కోరితే అక్కడ నుంచి పోటీ చేస్తానని విజయవాడలో విలేకరులతో అన్నారు. ఇంతవరకూ కేవలం పార్టీ ప్రచారాలకే పరిమితమయ్యాననీ ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకోవాలనుకుంటున్నాని చెప్పుకొచ్చారు.
తెలంగాణపై మీ వైఖరి ఏంటని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. పార్టీ ఇప్పటికే దీనిపై చెప్పేసింది అని చెప్పారు. ప్రజలు ఎలా కోరుకుంటే అలాగే పార్టీ నడుచుకుంటుందన్నారు.
మరో నాలుగేళ్లలో తన కుమారుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం చేస్తాడని అన్నారు. తను మాత్రం ప్రజాసేవకు అంకితమవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు గన్నవరం వచ్చిన బాలకృష్ణను అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. అనంతరం మోటార్ బైకులపై ర్యాలీగా వస్తుండగా విజయవాడ స్టెల్లా కాలేజీ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో నలుగురు అభిమానులు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Post a Comment