.
Home » » చిరంజీవి 150వ సినిమా కోసం అశ్వనీదత్‌ కర్చీఫ్...‌!!

చిరంజీవి 150వ సినిమా కోసం అశ్వనీదత్‌ కర్చీఫ్...‌!!

Written By Hot nd spicy on Monday, 9 July 2012 | 11:29

చిరంజీవి ఇక సినిమాలు చేసుకోవడమే బెటర్‌ అని సన్నిహితులు సూచిస్తున్నారు. రాజకీయ వాతావరణం సరిగ్గాలేకపోవడం.. కాంగ్రెస్‌ పార్టీవారు గత ఉప ఎన్నికల్లో సరిగ్గా సహకారం అందించలేదని బాహాటంగా చిరంజీవి చెప్పడంపై పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో రాజకీయాన్ని మరింత వేడిచేయడం ఎందుకుని చిరంజీవి సన్నిహితులు అశ్వనీదత్‌ సూచించినట్లు తెలిసింది. అందుకే తను తీయబోయే చిత్రానికి చిరును ఎంపిక చేయనున్నట్లు ఫిలింనగర్‌ కథనం.

చిరంజీవి 150వ చిత్రం ఎవరితో ఎలా చేయాలో..అంటూ గత ఏడాదిపాటుగా తీవ్ర చర్చలు, కాంబినేషన్‌లు వెతుక్కుంటున్న చిరంజీవి అశ్వనీత్‌ వంటి నిర్మాత రావడంతో కాస్త తేలికయినట్లయిందని చిరు వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే అద్భుతమైన కథగా ఉండాలని, జగదేగవీరుడు అతిలోకసుందరి, లేదండే ఇంద్ర వంట కాన్సెప్ట్‌లతో కథను తీర్చిదిద్దాలని చూస్తున్నారు. ఇప్పటికే పరుచూరి బ్రదర్స్‌ ఓ కథను సిద్ధం చేసుకున్నారు. దీనికి ప్రముఖ రచయితలు కూడా ఉడతాభక్తిగా కొంత సహాయం కూడా చేస్తున్నారు.

ఎంతోమంది కృషితో కథను ఒక రూపానికి తెచ్చి చిరంజీవికి ఎట్టి పరిస్థితుల్లో ప్లాప్‌ చిత్రం కాకూడదని జాగ్రత్తపడుతున్నారు. అయితే మగధీర తరహాలో చిత్రం ఉండాలని అశ్వనీదత్‌ రచయితలకు సూచించినట్లు తెలిసింది. వయస్సురీత్యా మెగాస్టార్‌ ఆ తరహా కథను చేయగలడా? లేదా? అన్నది సందేహమే. చూద్దాం... చిరు ఏం చెపుతారో.. కేంద్రంలో మినిస్టర్ పదవి వస్తే మళ్లీ సైడ్ అయిపోతారేమో...? ఎంతైనా రాజకీయ నాయకుడయ్యారు కదా...!!
Share with Friends :

Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger