మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే ఇండస్ట్రీ రికార్డులు బద్దలవ్వాల్సిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి', ‘బిజినెస్ మేన్' చిత్రాలు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచాయి. త్వరలో వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం వీరి తాజా చిత్రానికి స్టోరీలైన్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇటీవలే పూరి జగన్నాథ్ మహేష్ బాబును కలిసి స్టోరీ వివరించాడని, స్టోరీలైన్ నచ్చడంతో పాటు స్క్రిప్టు విషయంలో పూరిపై నమ్మకంతో దాన్ని పరిశీలించకుండానే సినిమాకు ఓకే చెప్పినట్లు చర్చించుకుంటున్నారు. ఈచిత్రాన్ని గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు.
ప్రస్తుతం పూరి జగన్నాత్ పవన్ కళ్యాణ్ హీరోగా కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరో వైపు మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తుండటంతో పాటు సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు.
ఇద్దరూ కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మహేష్-పూరి కొత్త చిత్రం మొదలు కానుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండుకు తగిన విధంగా పూరి జగన్నాథ్ స్కిప్టు, డైలాలుగు సిద్ధం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయడానికి ప్రణాళికలు పూర్తి తయారు చేస్తున్నారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment