.
Home » » అల్లు అర్జున్ 'జులాయి'గా రాబోతున్నాడు..

అల్లు అర్జున్ 'జులాయి'గా రాబోతున్నాడు..

Written By Hot nd spicy on Friday, 6 April 2012 | 10:40

పనీపాటా లేకుండా బేవార్స్‌గా తిరిగేవాడే జులాయి అని నానుడి. అలాంటి వాడి పాత్రలో అల్లు అర్జున్‌ నటించాడు. ఆ జులాయిని ప్రేమించే వ్యక్తిగా ఇలియానా నటిస్తోంది. ప్రేమను పొందడానికి జులాయి ఏం చేశాడు? అనేది చాలా ఇంట్రస్ట్‌గా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈనెల 8న అర్జున్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర పోస్టర్‌ను విడుదల చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అయితే జులాయి సెకండాఫ్‌లో వచ్చేసరికి కొన్ని బాధ్యతలు మీద వేసుకుంటాడు. అవి ఏమిటనేవి చాలా ఇంట్రస్ట్‌గా ఇటీవలే షెడ్యూల్లో చిత్రీకరించారు.

అల్లు అర్జున్‌ హిట్‌ కోసం చూస్తున్నాడు. ఈ చిత్రంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా త్రివిక్రమ్‌ పంచ్‌ డైలాగ్‌లు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు.
Share with Friends :

Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger