Home »
FEATURE
» రచ్చ రికార్డు కలెక్షన్లు.. తొలిరోజే రూ.8.5 కోట్లు వసూళ్లు
రచ్చ రికార్డు కలెక్షన్లు.. తొలిరోజే రూ.8.5 కోట్లు వసూళ్లు
రచ్చ తొలిరోజు రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. మెగా పవర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. అనధికార లెక్కల ప్రకారం రచ్చ తొలిరోజు రూ. 8.5 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం. తొలిరోజే ఇంతటి భారీ కలెక్షన్లను వసూలు చేయడం సినీ ఇండస్ట్రీలోనే ఆల్‌టైమ్ రికార్డని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో రచ్చ.. దూసుకు పోతోంది. కాగా ఈ వేసవి స్పెషల్ సినిమాల్లో తొలి చిత్రంగా విడుదలైన రచ్చ విజయవంతంగా ప్రదర్శించబడటంపై ఇండస్ట్రీ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఐపీఎల్ క్రికెట్ పోటీలు జరుగుతున్నన్నప్పటికీ రచ్చకు ప్రేక్షకులు తాకిడి ఎక్కువగా ఉండటంపై దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment