Home »
» పార్టీలు మార్చేవారిపై అధినాయకుడు బాలయ్య సెటైర్లు..!!
పార్టీలు మార్చేవారిపై అధినాయకుడు బాలయ్య సెటైర్లు..!!
నాయకుడు అనేవాడు తరతరాలకు స్ఫూర్తినివ్వాలి. అటువంటి పాత్రను బాలయ్య పోషించాడని 'అధినాయకుడు' చిత్ర దర్శకుడు పరుచూరి మురళి తెలియజేస్తున్నాడు. ఆయన పాత్ర గురించి వివరిస్తూ... నమ్ముకున్నవాళ్ళకు న్యాయం చేసేందుకు నాయకుడు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి. అలాంటి సిసలైన నాయకుడి కథే అధినాయకుడు. హైదరాబాద్‌లో మొదలై రాయలసీమకు మారుతుంది. ఇందులో కథకు తగినట్లు రకరకాల గెటప్పులు ఉంటాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చేపాత్ర చిత్రానికి హైలెట్‌గా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్ పాత్ర కోసం రెండో ఛాన్స్ లేకుండా బాలకృష్ణ కోసమే కథ తయారు చేశా. అలా మరో రెండు గెటప్స్ వచ్చాయి అని చెప్పారు. అయితే ఇందులో పొలిటికల్ సెటైర్లు, పంచ్ డైలాగ్‌లు ముమ్మరంగా ఉన్నాయని తెలిసింది. పార్టీలు మార్చేవారినుద్దేశించి ఘాటుగా స్పందించే పవర్‌ఫుల్ డైలాగ్‌లున్నాయి. అవి ఎవర్ని ఉద్దేశించి కాకపోయినా ఇప్పటి రాజకీయ రంగానికి అతికినట్లుంటాయని చెప్పారు. ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేడానికి సిద్ధం చేశారు. అయితే పోస్టుప్రొడక్షన్స్‌లో కొంతభాగం ఉన్నందున ఒకరోజు అటుఇటుగా విడుదల కావచ్చని తెలిసింది.
Post a Comment