పవన్ కళ్యాణ్ వేసుకున్న బట్టలును వేలం పాట వేయనున్నారని సమాచారం. పవన్ తాజాగా నటిస్తున్న గబ్బర్ సింగ్ చిత్రంలో పోలీస్ డ్రస్ ని ఇందుకు ఎంచుకున్నారు. అయితే సినిమా విడుదలైన మొదటి వారంలో ఈ వేలం జరుగుతుందని సమాచారం. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బుని ఛారిటీకి వినియోగించనున్నారని చెప్తున్నారు. గతంలోనూ బాలకృష్ణ సింహా గొడ్డలి వంటివి వేలం వేసి ఆ వచ్చే డబ్బుని పేద కళాకారుల ఫండ్ కి విరాళంగా ఇచ్చారు. ఈ వేలం పాటలో అభిమానులు ఆనందంగా పాల్గొని మరీ ఎక్కువ రేటుకి కొనుగోలు చేస్తూంటారు.
ఇక పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గబ్బర్‌సింగ్'. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ శంకర్ ఎస్.దర్శకత్వం వహిస్తున్నారు. శివబాబు బండ్ల సమర్పిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. గబ్బర్ సింగ్ ఆడియో ఈ రోజే జరగనుంది. ఎక్కడెక్కడి అభిమానులు హైదరాబాద్ శిల్పకళా వేదికను చేరుకుంటున్నారు. నాలుగైదు తెలుగు ఛానెల్స్ ఈ లైవ్ ను ఇవ్వటానికి రెడీ చేసుకుంటున్నారు. మరో ప్రక్క పవన్ సింహాచలం వెళ్లి దైవదర్శనం చేసుకుని హైదరాబాద్ చేరుకుంటున్నారు.
ఈ ఆడియో గురించి గణేష్ మాట్లాడుతూ "గ్రాండ్‌గా పాటల్ని విడుదల చేస్తాం. 15న ఉదయం పవన్‌కల్యాణ్‌గారు స్పెషల్ ఫ్లైట్‌లో తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని అభిమానుల్ని కలుసుకుంటారు. వైజాగ్, సింహాచలంలో కూడా దైవదర్శనం చేసుకుని అభిమానుల్ని కలుసుకుంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్‌గా జరిగే 'గబ్బర్‌సింగ్' ఆడియో ఫంక్షన్‌లో పాల్గొంటారు'' అని అన్నారు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఎంటర్టైనర్ ఈ చిత్రం అందర్ని అలరిస్తుందని చెప్తున్నారు.
హిందీ చిత్రం దబాంగ్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో పవన్ పోలీస్ అధికారిగా కనిపిస్తారు. పూలు అమ్మే అమ్మాయిగా శ్రుతి హాసన్ అందాలు పరచనుంది. పంచ్ డైలాగులు,ఊపొచ్చే పాటలతో అభిమానులు మెచ్చుకునేలా ఈ చిత్రాన్ని పవన్ పూర్తి దృష్టి పెట్టి చేసారు. ఈ సినిమాతో తన వరస ప్లాప్ లకు గండిపడుతుందని పవన్ భావిస్తున్నారు. హరీష్ శంకర్ సైతం మిరపకాయ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్టైతే పెద్ద దర్శకుల జాబితాలో హరీష్ చేరుతారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment