సినిమాల్లో సంభాషణల పేరుతో వంశ పరువు ప్రతిష్ఠల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఆయా వర్గాల అభిమానుల కోసం కాందంటున్నారు బోయపాటి శ్రీను. ఆయన రీసెంట్ గా తన దమ్ము చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై స్పందించారు. ఆయన మాటల్లోనే...అభిమానుల్ని సంతృప్తిపరచాల్సిందే. అయితే కేవలం వారిని దృష్టిలో ఉంచుకొనే సినిమాలు తీయకూడదు. సినిమా అంటే అందరికీ నచ్చాలి. అప్పుడు అభిమానికి పదింతలు నచ్చుతుంది. వంశం పేరుతో ఒకరిపై ఒకరు డైలాగులు విసురుకోవడం మంచిది కాదు. ఇప్పుడు పరిశ్రమలో వాతావరణం బాగుంది. దాన్ని ఇలానే ఉంచాలి అన్నారు.
అలాగే 'దమ్ము'చిత్రం ఎలా ఉండబోతోందో చెపుతూ..బాలకృష్ణను 'సింహా'గా చూపించాక ఎన్టీఆర్‌తో సినిమా చేస్తే అంచనాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. వాటిని దృష్టిలో ఉంచుకొనే రంగంలోకి దిగా. ఎన్టీఆర్‌లోని నటుణ్ని సంపూర్ణంగా ఆవిష్కరించే కథ సిద్ధం చేశా. అంచనాలు అందుకొన్నానో లేదో సినిమా చూసి మీరే చెప్పాలి. నందమూరి కథానాయకులతో వరుసగా రెండు సినిమాలు అనేది మామూలు విషయం కాదు. ఎన్టీఆర్‌తో కాకుండా మరో హీరోతో సినిమా చేస్తే ఇన్ని అంచనాలు ఉండేవి కావు అన్నారు.
చిత్రం కథ గురించి చెపుతూ...ఇది వరకు నా ఖాతాలో మూడు సూపర్ హిట్స్ ఉన్నాయనే సంగతి ఎప్పుడో మర్చిపోయా. ప్రతిదీ నా మొదటి సినిమాయే అనుకొంటాను. 'ఈ సినిమాతోనే నా భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంది...' అనే కసితో పని చేస్తానంతే. ఎన్టీఆర్‌ని ఇప్పటి వరకూ ఒక్కో దర్శకుడూ ఒక్కో కోణంలో చూపించారు. వాటిని కూడా గుర్తుకు తెచ్చుకోలేదు. ఆయన కోసం కథ రాసుకొనేటప్పుడు కేవలం ఓ అభిమానిలా ఆలోచించా. ఎన్టీఆర్ సినిమా అంటే మొదటి రోజు.. మొదటి వరుసలో కూర్చుని సినిమా చూడాలనుకొనే అభిమాని మదిలో ఉండే ఆలోచనలతో కథ రాశా అని తేల్చి చెప్పారు.
సింహా తర్వాత బోయపాటి శ్రీను తీస్తున్న ఈ చిత్రంపై మంచి అంచానాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం గురించి బయిట పాజిటివ్ టాక్ ఉంది. ఈ చిత్రం గ్యారెంటీగా ఫ్యాన్స్ ని మాత్రమే కాక అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. ఈ సినిమాలో త్రిష,కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఏప్రిల్ 27న ఈచిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని కె.ఎస్.రామారావు సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment