'దిల్' రాజు ఏం చేసినా ఒకటి రెండు సార్లు ఆలోచించి చేస్తుంటాడు. ఇటీవలే జర్నలిస్టులు ముగ్గురు కలిసి సినిమా తీసి సేఫ్ అవుదామని వచ్చిన రేటుకాడికి డిస్ట్రిబ్యూటర్లుకు ఇచ్చేశారు. ఆ సినిమానే 'ఈరోజుల్లో'. ఒక్క తెలిసిన మొహంలేని ఈ సినిమాను విడుదలకుముందు నిర్మాతలు దిల్ రాజుకూ ఒక మాటగా చెప్పారు. విడుదల చేయండి చూద్దాం అన్నారు. అప్పుడు వేలుపెట్టని దిల్‌రాజు టాక్ బాగావచ్చి, సినిమా పిచ్చపిచ్చగా ఆడడడంతో.. ఆ చిత్రాన్ని తను టేకప్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని బుధవారం మీడియా ముందు సెలవిచ్చారు.
దీన్ని ముందుగానే గ్రహించిన కొందరు డిస్ట్రిబ్యూటర్లు హైదరాబాద్‌లోని ఛాంబర్ కార్యాలయానికి వచ్చి తిష్టవేశారు. అనామక సినిమాగా ఉన్నప్పుడే తాము నిర్మాతల నుంచి కొన్నామనీ.. ఇప్పుడు దిల్ రాజుకు నిర్మాతలు అమ్మేస్తే తాము ఏం చేయాలని నిలదీశారు.
ఛాంబర్ కార్యవర్గ సభ్యుల్లో ఒకరైన దిల్ రాజుకు ఈ విషయాన్ని ఏదో విషయం తేల్చేయాలని అధ్యక్షుడు సూచించాడు. యువతను బాగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రంపై నిర్మాతలు కూడా నమ్మకంలేదు. అందుకే వచ్చినకాడికి వదిలించుకున్నారు.
ఉగాదినాడు రిలీజైన ఈ సినిమాకు ఆదరణ చూసి వారే ఖంగుతిన్నారు. మినిమమ్ థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను పలు జిల్లాల్లోనూ ప్రింట్లు కావాలని అడుగుతున్నారు. ఇది గ్రహించిన దిల్ రాజు... మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని చూశారు. చూసిన వెంటనే ఈ చిత్రాన్ని తానే రిలీజ్‌చేస్తానని చెప్పాడు.
దీని వల్ల నిర్మాతలకి ఇంకొంత లాభం వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి మరింతగా రాబట్టేందుకు వారికి ధైర్యంలేదు గనుక దిల్ రాజు వంటివారు ఉంటే తమకు మరింత సేఫ్‌గా ఉంటుందని నిర్మాతలు భావించారు. దీంతో ఛాంబర్ కలుగజేసుకుని.... డిస్ట్రిబ్యూటర్లను మెప్పించే ప్రయ్నతం చేస్తుంది.
కాగా, దిల్ రాజు అనేవాడు రాకపోతే... తమకు రూపాయికు మూడు రూపాలు వచ్చేలా ఉన్నాయనీ. గత చిత్రాలతో నష్టపోయిన మాకు ఈ చిత్రం ఊపిరినిచ్చిన టైమ్‌లో గద్దలా తన్నుకుపోయాడని కొందరు డిస్ట్రిబ్యూటర్లు వాపోయారు.
విశేషం ఏమంటే.. సినిమా అమ్మేటప్పుడు.. అగ్రిమెంట్లు.. ఎన్.ఆర్.ఐ.లు రాసుకుంటారు సహజంగా... కానీ ఈ సినిమాకు అలాంటివిలేకుండా స్పాట్ పేవ్‌మెంట్‌తో నిర్మాతలు ఎవరు తమ దగ్గరకు వచ్చారో ఆ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. ఇలాంటి ఛాన్స్ మళ్ళీరాదని వారి బాధ.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment