హీరోయిన్ అమలపాల్, తమిళ హీరో ఆర్య మంచి స్నేహితులు. అయితే ఓ ముద్దు సంఘటన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ తెగ్గొట్టిందట. అసలు ఏం జరిగిందంటే...ఇటీవల ఈ ఇద్దరు ‘వెట్టై’ అనే తమిళ చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య ఘాటైన లిప్ లాక్ ముద్దు సీన్ ప్లాన్ చేశాడు దర్శకుడు లింగుస్వామి. కథ డిమాండ్ మేరకు దర్శకుడు చెప్పినట్లు ఇద్దరు ఏ మాత్రం మొహమాట పడకుండా ముద్దు సీన్లో రెచ్చపోయారు. అయితే ఆ సినిమా విడుదలైన అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఆర్య మాట్లాడుతూ......సినిమాలో అమలతో ముద్దు సీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఫీలయ్యా అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు.
ఆర్య అలా మాట్లాడటంతో అమలాపాల్ చాలా అప్ సెట్ అయిందని, ఆమె మనసు గాయపడిందని కోలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. అప్పటి నుంచి అమలు ఆర్యతో అసలు మాట్లడటమే మానేసిందట. ఇటీవల ఆర్య ఇంట్లో జరిగిన ఓ వేడుకకు కూడా హాజరు కాలేదు. దీన్ని బట్టి ఇద్దరి మధ్య స్నేహ బంధం కట్టయిందని, ఇకపై ఇద్దరూ కలిసి నటించడం కూడా డౌటే అంటున్నారు. అయితే అమల పాల్ మాత్రం ఈవార్తలను ఖండిస్తోంది. అలాంటిదేమీ లేదని, తాను ఆ సమయంలో దుబాయ్‌లో ఉండటం వల్లనే హాజరు కాలేకపోయానని అంటోంది.
కాగా... ‘వెట్టై’ తెలుగులో ‘భలే తమ్ముడు’గా అనువదించనున్నారు. ఈ చిత్రం ఇటీవల తమిళంలో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో మాధవన్-ఆర్యలకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇక్కడ కూడా మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులు దక్కించుకోవడానికి పలువురు తెలుగు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
Post a Comment