హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రాబోతోందా? వీరిద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా? అంటే..... ఎప్పటికైనా ఇది సాధ్యపడవచ్చు అనే వాదన ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఒకరేమో సూపర్ స్టార్, ఒకరేమో పవర్ స్టార్. ఇద్దరూ బాక్సాఫీసు కింగులే. సినిమా హిట్టయినా, ఫట్టయినా నిర్మాత మాత్రం నష్టపోడు. ఎందుకంటే ఓపెనింగ్స్ తోనే పెట్టుబడి వచ్చేస్తుంది. భారీ హిట్టయితే నిర్మాత కుబేరుడవ్వడం ఖాయం.
తాజాగా ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నారు పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో కలిసి చేయడానికి ఒప్పుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. గతంలో మహేష్ బాబు జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలకు తోడు నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ చాలా రోజు క్రితం చేసిన ఓ ట్వీట్ కూడా...మహేష్-పవన్ కాంబినేషన్ సినిమా వస్తుందనే వార్తకు బలం చేకూరుస్తోంది. స్క్రిప్టు డిమాండ్ చేస్తే పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడానకి తనకు అభ్యంతరం లేదని మహేష్ చెప్పాడని అల్లు శిరీష్ ట్వీట్ వెనక ఆంతర్యం. మరి ఈ వార్త ఎప్పుడు నిజం అవుతుందో చూడాలి.
ప్రస్తుతం మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీ స్టారర్ చిత్రంలో వెంకటేష్ మరో హీరోగా చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Post a Comment