జూ.ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం దమ్ము. ఈ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పటికే ప్రారంభమైంది. మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్టుకు అన్ని ఏరియాలనుంచి మంచి క్రేజీగా బిజినెస్ సైతం జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. సీడెడ్ రైట్స్ ను బళ్లారి సాయి,ఎన్ వి ప్రసాద్ కలిసి ఏడున్నర కోట్లకు తీసుకున్నట్లు చెప్తున్నారు. అలాగే కడప రైట్స్ ని కోటిన్నరు కోడూరు మధుకి ఇచ్చారని తెలుస్తోంది. ఇక మిగతా ఏరియాల్లో కూడా ఇదే రేంజిలో బిజినెస్ జరుగుతోందని చెప్పుకుంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపించాడని, ఇప్పటివారకూ ఎన్టీఆర్ ఇలాంటి సీన్స్ చేయలేదని ముక్త కంఠంతో చెప్పటంతో నిర్మాత కెఎస్ రామారావు చాలా హ్యాపీ ఫీలయ్యారని ఫిల్మ్ నగర్ సమాచారం. రామ్-లక్ష్మణ్ లు రూపొందించిన ఫైట్స్ అందరినీ అలరిస్తాయని, ముఖ్యంగా మాస్ చేత విజిల్స్ వేయించేలా బోయపాటి శ్రీను డిజైన్ చేసాడని అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పవర్ ఫుల్ పాత్రలు చేస్తున్నాడని చెప్తున్నారు. అలాగే సెకెండాఫ్ లో ఎన్టీఆర్ చెప్పే లెంగ్తీ డైలాగులు హాట్ టాపిక్ గా మారతాయని, అవి ఇండస్ట్రీలో రికార్డుగా మిగులుతాయని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 2012 వేసవిలో విడుదల చేస్తారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కార్తీక,త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...ధైర్యమంటే చీకట్లో ఒంటరిగా నడుచుకొంటూ వెళ్లడం కాదు.. అదే దారిలో వచ్చే పదిమందికి వెలుగు చూపించడం. దమ్మంటే ఒంటి చేత్తో వందమందిని చితగ్గొట్టడం కాదు.. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా దుమ్మురేపి నెగ్గుకురావడం. మా హీరో అదే చేశాడు. ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన అనుభవాలేంటో మా సినిమా చూసి తెలుసుకోండి అన్నారు. అలాగే 'పేరుకు తగ్గట్టే దమ్మున్న కథ ఇది. ఎన్టీఆర్ లోని యాక్షన్ కోణాన్ని మరో విధంగా చూపిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలూ ఉంటాయి.

Post a Comment