భాక్సాఫీస్ బాధ్షా షారూఖ్ ఖాన్ రికార్డుని అమీర్ ఖాన్ బ్రద్దలు కొట్టారు. ఆయన తాజా చిత్రం ‘తలాష్’కి సంబంధించిన థియేరిటికల్ రైట్స్ ని రిలయన్స్ సంస్థ 90కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. గతంలో షారూక్‌ఖాన్ ‘డాన్2’ చిత్రానికి ఇవే థియేరిటికల్ రైట్స్ క్రింద 80 కోట్లు లభించాయి. దాంతో ఇప్పుడు ఆ రికార్డుని చెరిపేసి కొత్త రికార్డుని క్రియేట్ చేసినట్లైంది. ఇక గత కొంత కాలంగా బాలీవుడ్ ట్రేడ్ రికార్డ్‌ల విషయంలో షారూక్, అమీర్‌లు పోటాపోటీగా తలపడుతున్నారు. ‘త్రీ ఇడియట్స్’తో ఆల్‌టైమ్ బాలీవుడ్ కలెక్షన్స్ రికార్డు సాధించి కొత్త రికార్డుని క్రియేట్ చేసారు అమీర్. అయితే ‘డాన్ 2’ చిత్రంతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు షారూక్.
తాజాగా ‘తలాష్’ చిత్ర హక్కుల రికార్డుతో అమీర్‌ఖాన్ బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్‌ను అధిగమించి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపరిచారు. కరీనాకపూర్, రాణిముఖర్జీ హీరోయిన్స్ గా చేస్తున్న ‘తలాష్’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Post a Comment