అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫైట్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారు. పీటర్ హెయిన్స్ ఈ ఫైట్స్ ను రూపకల్పన చేశారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...బన్నీ పూర్తిస్థాయి వినోదాన్ని పంచే చిత్రమిది. ఆయన పలికే సంభాషణలు అలరిస్తాయి. సరదాసరదాగా సాగిపోయే ప్రేమ కథ ఇది. ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
ముఖ్యంగా త్రివిక్రమ్ కథను నడిపిన విధానం, సంభాషణలు హైలైట్. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలోనూ, నగర శివార్లలోనూ ముఖ్య సన్నివేశాల్ని తెరకెక్కించామని అన్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పేరుని వెల్లడిస్తారు. రాజేంద్రప్రసాద్ కీ రోల్ ని పోషిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, సోనుసూద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, తులసి, హేమ తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: డి.వి.వి.దానయ్య, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: ఎస్.రాధాకృష్ణ .

Post a Comment