పవన్ కళ్యాణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొంద బోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ఈ సినిమా ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయమై పూరి జగన్నాథ్ నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. మీడియా మాఫియా నేపథ్యంలో సినిమా స్టోరీలైన్ ఉంటుందనే ప్రచారం ఫిల్మ్ నగర్లో సాగుతోంది.
గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నాడు. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది.పవన్ కళ్యాణ్ ఇందులో కొండవీడు పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Post a Comment