హైదరాబాద్: ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ ‘జిస్మ్ 2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా నెగెటివ్ టాక్ వచ్చినా ఈచిత్రంలో సన్నీ లియోన్ ఆరబోసిన అందాలకు కోట్ల వర్షం కురిసింది. అంటే కేవలం ప్రేక్షకులు సన్నీ లియోన్ నగ్న అందాలను చూడటానికే థియేటర్లకు వచ్చారన్నమాట.
ఈ పాయింటును గ్రహించిన పలువురు టాలీవుడ్ నిర్మాతలు, దర్శకుడు సన్నీ లియోన్‌తో తెలుగులో ఓసినిమా చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారట. తెలుగులో రూపొందించి దక్షిణాదిన ఇతర బాషల్లో అనువాదం చేసుకుంటే బోలెడు డబ్బులు వస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారట.
అయితే సన్నీ లియోన్ మాత్రం బాలీవుడ్ కంటే కిందకి దిగడానికి ఇష్టం పడటం లేదట. జిస్మ్ 2 చిత్రంతో బూతు సినిమాల దారి నుంచి మామూలు సినిమాల దారిలోకి మళ్లిన సన్నీ హాలీవుడ్‌పై దృష్టి పెడితేనే తనకు అందాలకు ఎక్కువ గిట్టుబాటు అవుతుందనే ఆలోచనలో ఉందట. ఈ నేపథ్యం సన్నీ లియోన్ కోసం చూస్తున్న టాలీవుడ్ నిర్మాతల ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందే చూడాలి.
Post a Comment