ఇటీవల హీరోయిన్లు ఏదైనా ఫంక్షన్‌కు అటెండ్ అయితే అక్కడ డాన్స్‌లు వేయడం, ఆడిపాడి మెప్పించడం జరుగుతుంది. లేటెస్ట్‌గా రామ్ చరణ్ పెండ్లిరోజు ప్రముఖ హీరోయిన్లు కూడా సంగీత్ కార్యక్రమంలో ఆడి పాడారు. అందులో తమన్నా కూడా ఉంది.
చాలా చక్కగా డాన్స్ చేసి మెప్పించింది. దీంతో ఆమె భారీగా పారితోషికం తీసుకుందనే కామెంట్లు వచ్చాయి. ఈ విషయం ఆమె దృష్టికి తీసుకువస్తే.... చివాట్లు పెట్టింది. ఏం అడుగుతున్నారు మీరు... నా స్వంత ఇంటి ఫంక్షన్‌లో నేను డబ్బులు తీసుకుంటానా? అంటూ ఎదురు ప్రశ్నించింది.
రామ్ చరణ్ మంచి ఫ్రెండ్. చిరంజీవి ఫ్యామిలీ నా ఫ్యామిలీగా అనుకుంటాను. నా స్వంత ఇంటిలో మేరేజ్ పంక్షన్ జరుగుతుంటే ఆ మాత్రం బాధ్యతగా నేను పాల్గొన్నాను. అలా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి లేనిపోని ట్రిక్‌లు ప్లే చేసి మా మధ్య అంతరాలు తేకండని పలికింది. అంతగా చెప్తోందంటే డబ్బులు తీసుకోకుండానే డ్యాన్స్ చేసి ఉంటుంది కదూ.
Post a Comment