కొరియోగ్రాఫర్, దర్శకుడు, నయన మాజీ ప్రియుడు ప్రభుదేవా హిందీలో "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. తమిళంలో ఈ సినిమా సమ్‌థింగ్ సమ్‌థింగ్ పేరుతో తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా హిట్టయ్యేందుకు త్రిష నటన ఓ కారణం.
అయితే హిందీలో కూడా ఈ రోల్‌లో నటిస్తావా అని ప్రభుదేవా అడగ్గానే త్రిష కూడా ఓకే చెప్పేసిందట. అయితే కాల్షీట్ సమస్య త్రిషను వెంటాడుతోందట. ఫలితంగా తెలుగు, తమిళ సినిమాలతో బిజీబిజీగా ఉంటున్న త్రిష.. సమ్‌థింగ్ సమ్‌థింగ్ హిందీ రీమేక్‌లో నటించేందుకు బల్క్‌గా డేట్స్ ఇవ్వాలని ప్రభుదేవా అడిగాడట.
కానీ ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతాననే భయంతోనే ప్రభుదేవా సినిమాకు త్రిష టాటా చెప్పేసిందని.. త్రిష తల్లి ఉమా కృష్ణన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఛాన్స్‌ను గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతిహాసన్ కైవసం చేసుకుంది.
గబ్బర్ సింగ్ హిట్‌తో అమ్మడు మార్కెట్ తారా స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో తెల్లపిల్ల శృతికి ఆఫర్ల మీద ఆఫర్లొస్తున్నాయి. మరి తాజాగా త్రిష ఆఫర్‌ను కొట్టేసిన శృతిహాసన్.. ఇకపై భవిష్యత్తులో టాప్ హీరోయిన్ల ఆఫర్లను కూడా సొంతం చేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్. ఎనీవే ఆల్ ది బె శృతి..!

Share with Friends : |
Share with Friends : |
Post a Comment