చిరంజీవి నటించిన ‘ఇంద్ర' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ చిత్రం భారీ విజయం సాధించి నిర్మాతలకు లాభాల వర్షం కురిపించింది. చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించిన ఈచిత్రాన్ని మెగా దర్శకుడు బి.గోపాల్ డైరెక్ట్ చేయగా... మెగా చిత్రాల నిర్మాత అశ్వినీదత్ భారీ వ్యయంతో దీన్ని నిర్మించారు.
పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం తాజాగా బాలీవుడ్లో రీమేక్ కాబోతోందట. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ ఈచిత్ర హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. సంజలీల్ బన్సాలీ ఇటీవల ‘విక్రమార్కుడు' రీమేక్ రైట్స్ దక్కించుకుని ‘రౌడీ రాథోడ్' పేరుతో ప్రభుదేవాతో డైరెక్ట్ చేయించాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో మరిన్ని పాత సూపర్ హిట్ తెలుగు సినిమాలపై కన్నేశాడు. ఈ నేపథ్యంలో ఇంద్ర చిత్రం రీమేక్ ఆలోచనకు వచ్చాడట బన్సాలీ.
ఇంద్ర చిత్రం అప్పట్లో హిందీలో కూడా అనువాదం అయింది. అయితే హిందీలో అప్పట్లో చిరంజీవికి పెద్ద ఫాలోయింగ్ లేక పోవడంతో అక్కడి జనాలు ఆ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఈచిత్రాన్ని సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో చేస్తే మంచి ఫలితాలను ఇస్తుందని, సల్మాన్ వయస్సు, బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సరిపోతుందని బన్సాలీ భావిస్తున్నాడట. సల్మాన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. వరుస తెలుగు చిత్రాలు హిందీలో సూపర్ హిట్ అవుతుండటంతో తెలుగు సినిమా సత్తా ఏమిటో బాలీవుడ్ జనాలు రుచి చూస్తున్నారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment