అపజయం అంటే ఏమిటో తెలియకుండా వరుస హిట్లతో, వరుస అవకాశాలతో దూసుకెలుతున్న హీరోయిన్ సమంత సూపర్ స్టార్ మహేష్ బాబును తెగ పొగిడేస్తోంది. అతను ఇచ్చిన ఐడియా వల్లే తాను ప్రతి సినిమాను కొత్తగా చేయగలుగుతున్నా...అందుకే ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది.
ఇంతకీ మహేష్ బాబు ఏం చెప్పాడు అని అడిగితే...‘ప్రతి సినిమాను తొలి సినిమాగానే ట్రీట్ చేయ్. తొలి సినిమాకు ఎంత తాపత్రయంతో పని చేస్తావో అదే స్టామినా ప్రతి సినిమాలోనూ చూపించు' అని చెప్పాడట. అప్పటి నుంచి మహేష్ బాబు చెప్పిన సూచనలు ఫాలో అవుతుందట సమంత. మహేష్ బాబు సూచనలు తన కెరీర్‌కి ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని, మహేష్ బాబుకు థాంక్స్ అంటూ వయ్యారాలు పోతోంది. ఫిల్మ్ నగర్ జనాలు మాత్రం మహేష్ బాబు స్మరణ చేసిన తనకు ఫాలోయింగ్ తగ్గకుండా సమంత జాగ్రత్త పడుతోందని అంటున్నారు.
సమంత ప్రస్తుతం బోలెడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇటీవల ఆమె నటించిన ఈగ చిత్రం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. వీటితో పాటు గౌతం మీనన్ దర్శకత్వంలో నాని సరసన ఎటోవెళ్లి పోయింది మనసు, దేవా కట్ట దర్శకత్వంలో నాగచైతన్య సరసన ఆటో నగర్ సూర్య, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నందినిరెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ సరసన ఓ సినిమా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రాల్లో నటిస్తోంది.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment