తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ..కనీసం కథ కూడా వినకుండా ఓ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చర్చనీయాంసమైంది. అయితే అన్న నమ్మకంతో ఓకే చెప్పిన ప్రాజెక్టు మరోదో కాదు.. రాజ్‌కుమార్ హిరాని రెడీ చేసిన ‘పీకే'చిత్రం స్క్రిప్టు. గతంలో అమీర్ ఇదే దర్శకుడుతో,నిర్మాతతో ‘3 ఇడియట్స్' చేసారు. అక్కడ పూర్తిగా రాజ్ కుమార్ హిరాని టాలెంట్ కు ఇంప్రెస్ అయిన అమీర్ ఇలా నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.
వివరాల్లోకి వెళితే...‘పీకే' చిత్రకథను కొన్ని నెలల క్రితం ఆమిర్‌కి పంపించారు రాజ్‌కుమార్. అయితే ‘తలాష్' షూటింగ్ వల్ల, టీవీ షో ‘సత్యమేవ జయతే'తో బిజీగా ఉండటంవల్ల ఈ కథ చదివే టైమ్ దొరకలేదు ఆమిర్‌కి. అసలు ఆ కథ గురించి మర్చిపోయారు కూడా. ఇక, ఆమిర్ నుంచి సమాధానం రాదని ఫిక్స్ అయ్యి, చాక్లెట్‌బోయ్ రణబీర్‌కపూర్ హీరోగా ఈ చిత్రం చేయాలని రాజ్‌కుమార్ నిర్ణయించుకున్నారు. కథలో కొన్ని మార్పులు చేసి, రణబీర్‌కి పంపించారు.
రాజ్‌కుమార్ హిరాని సామాన్య దర్శకుడు కాదు కాబట్టి, ఈ కథ కూడా నచ్చడంవల్ల ఈ చిత్రంలో నటించడానికి ఎప్పుడు డేట్స్ అడిగితే అప్పుడు ఇవ్వడానికి రణబీర్ రెడీ అయ్యారు. సరిగ్గా ఈ సమయంలో రాజ్‌కమార్‌కి ఆమిర్ ఫోన్ చేసి, ‘కథ చదివే టైమ్ దొరకడంలేదు. అయినా ఈ సినిమా చేస్తున్నా' అన్నారు. తన 23ఏళ్ల కెరీర్‌లో కథ తెలుసుకోకుండా ఆమిర్ చేయబోతున్న తొలి చిత్రం ఇదే.
రాజ్‌కుమార్ ఇప్పటివరకు మూడే మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అవి ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్, లగేరహో మున్నాభాయ్, 3 ఇడియట్స్'. ఈ మూడూ బ్లాక్‌బస్టర్సే. కథ వినకుండానే ఈ దర్శకుడితో ‘పీకే' చిత్రం చేయాలనుకోవడానికి అదొక కారణం అయితే, ‘3 ఇడియట్స్' చేసినప్పుడు రాజ్‌కుమార్ ప్రతిభ పూర్తిగా ఆమిర్‌కి తెలిసి ఉంటుంది. అందుకే కథ తెలుసుకోకుండా ఈ సినిమా చేయడానికి పెచ్చజెండా ఊపి ఉంటారని అమీర్ అభిమానులు ఫిక్స్ అవుతున్నారు.
‘త్రీ ఇడియట్స్'తో ఆల్‌టైమ్ బాలీవుడ్ కలెక్షన్స్ రికార్డు సాధించి కొత్త రికార్డుని క్రియేట్ చేసారు అమీర్. అయితే ‘డాన్ 2' చిత్రంతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు షారూక్. తాజాగా ‘తలాష్' చిత్ర హక్కుల రికార్డుతో అమీర్‌ఖాన్ బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్‌ను అధిగమించి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపరిచారు. కరీనాకపూర్, రాణిముఖర్జీ హీరోయిన్స్ గా చేస్తున్న ‘తలాష్' నవంబర్ 30న విడుదలకు సిద్ధమవుతోంది.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment