నాగార్జునతో రగడ,మంచు మనోజ్ తో బిందాస్ చిత్రాలు చేసిన వీరూ పోట్ల తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. నాగార్జున కుమారుడు నాగచైతన్య హీరోగా రూపొందబోయే చిత్రాన్ని ఆయన డైరక్ట్ చేయనున్నారు. ఈ మేరకు ఎగ్రిమెంట్ ఖరారు అయినట్లు సమాచారం. వీరూ పోట్ల చెప్పిన స్టోరీ లైన్ విన్న నాగచైతన్య వెంటనే ఓకే చేసినట్లు చెప్తున్నారు. అక్టోబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది.
ప్రస్తుతం దేవకట్టా దర్సకత్వంలో రూపొందుతున్న ఆటో నగర్ సూర్య లో నాగ చైతన్య ...రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్ధానం చిత్రంతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు దేవకట్టా కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి.నిర్మాత సైతం ఈ చిత్రంపై మంచి కాన్పిడెన్స్ గా ఉన్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ అవుతోంది.
అచ్చిరెడ్డి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...దేవాకట్టా మంచి కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న స్టయిలిష్ ఫిలిమ్ ఇది. హీరో క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగచైతన్యను పెద్దరేంజ్‌కి తీసుకువెళ్లే ప్రొటెన్షీయాలిటీ ఉన్న కథ ఇది. నిర్మాత వెంకట్‌కు కూడా ఈ కథ నచ్చడంతో చిత్రం నిర్మించడానికి పూనుకున్నాం. హీరో నాగచైతన్య మాట్లాడుతూ దేవాకట్టా చెప్పిన కథ చాలా బాగుంది. నా పాత్ర అద్భుతంగా మలచడానికి ఆయన ప్రయత్నిస్తుండడంతో నేను ఈ చిత్రానికి చేయడానికి పూనుకున్నాను. హీరోగా నాకు మంచి చిత్రం అవుతుంది, అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.
అలాగే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య... ఈ ముగ్గురు హీరోలుగా ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమాకి 'త్రయం' అనే పేరును పరిశీలిస్తున్నారు. వాల్ట్‌డిస్నీ, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తారు. ఈయన ఇటీవల విడుదలైన 'ఇష్క్' చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల కథానాయకుల్ని ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు.పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం సమకూరుస్తారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment