మెహర్ రమేష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 'షాడో'టైటిల్ తో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. వెంకీ మాఫియా డాన్ గా కనిపించే ఈ చిత్రం బడ్జెట్ వెంకటేష్ కెరీర్ లోనే హైయిస్ట్ బడ్జెట్ అని తెలుస్తోంది. ముప్పై కోట్లకు పైగా ఈ చిత్రం కోసం నిర్మాత పెట్టుబడి పెడుతున్నట్లు చెప్తున్నారు. వరస ప్లాపుల్లో ఉన్న వెంకటేష్ పై అంత పెట్టడం సేఫ్ బెట్ కాదని ట్రేడ్ లో వినిపిస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తాప్సి నటించనుంది.
ఇక ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. గతంలో మెహర్ రమేష్ రూపొందించిన బిళ్లా చిత్రం కూడా ఇక్కడే షూట్ జరుపుకుంది. అయితే ఇప్పుడు ఎక్కవ రోజులు పాటు మలేషియాలో షూట్ చేయనున్నారు. కామెడీతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. వెంకటేష్ ఈ చిత్రంపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు చిత్రం చేస్తున్న వెంకటేష్ ఈ చిత్రం తనని యాక్షన్ హీరోగా మరోసారి నిలబెడుతుందని భావిస్తున్నాడు.
ఈ చిత్రం గురించి నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ...'యాక్షన్ అంశాలకు ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. వెంకటేష్ హావభావాలు, వేషధారణ కొత్తగా కనిపిస్తాయి''అన్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ తన శైలి మార్చారు. గెడ్డం... కొత్త తరహా కేశాలంకరణతో కెమెరా ముందుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి క్రేజ్ వచ్చింది.
హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు సమకూర్చుతున్నాడు. థమన్ సంగీతం అందించనున్నారు. మధురిమ, ఎమ్మెస్ నారాయణ, నాగబాబు, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మీనన్, ధర్మవరపు, ప్రభు తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్.
ఇక వెంకటేష్ అన్న కొడుకు రానాతో పరుచూరి ప్రసాద్ ఇప్పటికే నా ఇష్టం చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసారు. అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. వెంకటేష్ బాడీగార్డ్ చిత్రం యావరేజ్ గా ఆడిన నేపధ్యంలో ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్టు కొట్టాలని చేస్తున్నారు. అలాగే వెంకటేష్ ..దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు. మహేష్,వెంకటేష్ ఆ చిత్రంలో అన్నదమ్ములుగా చేస్తున్నారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment