రాజమౌళి తాజా చిత్రం ఈగ అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ విజయపధంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులోనే కాక,తమిళ,మళయాళ భాషల్లో కూడా ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 3D వెర్షన్ పై అందరి దృష్టీ వెళ్ళుతోంది. హిందీలో ఈ చిత్రం డబ్ చేసి,త్రీడి ఫార్మెట్ లోకి మార్చి రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం త్రీడి కన్వర్షన్ వర్క్ జరుగుతోంది. ఇక నార్త్, మహా రాష్ట్రలలో ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి చెప్తున్నారు.
అయితే ఇప్పటికిప్పుడు ఓ సినిమాని 3D లోకి మార్చి రిలీజ్ చేయటం అంటే కష్టం. ఎందుకంటే 3D లోకి ఓ చిత్రాన్ని మార్చాలంటే చాలా టైమ్ తీసుకుంటుందనేది నిపుణులు చెప్తున్న మాట. ఇక ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి రాజమౌళి మీడియా తో మాట్లాడుతూ...చీమ - ఏనుగూ మధ్య గొడవ జరిగితే ఎవరు గెలుస్తారు? దోమతో సింహం ఫైటింగుకి దిగితే ఏం జరుగుతుంది? రెండు ప్రశ్నలకూ ఒకటే సమాధానం. అల్పప్రాణులపై బలవంతులదే రాజ్యం. అయితే ఈ అహంకారం, అతి విశ్వాసం అప్పుడప్పుడూ చేటు తీసుకొస్తుంది. ఆ కథ తాబేలు, కుందేలూ పరుగుపందెంలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ 'ఈగ' మనిషిపై పోటీకి దిగింది. మరి గెలిచిందా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే.
'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించ లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేసారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.సురేష్‌బాబు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment