.
Home » » 3D 'ఈగ'నాలుగు భాషల్లో విడుదల

3D 'ఈగ'నాలుగు భాషల్లో విడుదల

Written By Hot nd spicy on Sunday, 15 July 2012 | 05:29


ఈగ తెలుగులోనే కాక,తమిళ,మళయాళ భాషల్లో కూడా ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే ఈ నేపధ్యంలో ఈ చిత్రం 3D వెర్షన్ పై అందరి దృష్టీ వెళ్ళుతోంది. హిందీలో ఈ చిత్రం డబ్ చేసి,త్రీడి ఫార్మెట్ లోకి మార్చి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసారు. ఈగ హిందీ వెర్షన్ టైటిల్ మక్కి అని తెలుస్తోంది. ప్రస్తుతం త్రీడి కన్వర్షన్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ లో విడుదల కాబోయే ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ,మళయాళం, హిందీ లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 3D లోకి ఓ చిత్రాన్ని మార్చాలంటే చాలా టైమ్ తీసుకుంటుందనేది నిపుణులు చెప్తున్న మాట.
ప్రస్తుతం ఎక్కడ విన్నా రాజమౌళి తాజా చిత్రం ఈగ గురించే చర్చలు. హీరో లేకుండా కేవలం ఈగ ను పెట్టి హిట్ కొట్టిన రాజమౌళిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంకు సీక్వెల్ తీస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. అయితే రాజమౌళి ఈ చిత్రం సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. విజయ యాత్రల్లో ఉన్న ఆయన మాట్లాడుతూ..చిత్ర నిర్మాతలు సురేష్ బాబు,సాయి కొర్రపాటి ఇద్దరూ కూడా ఈ సీక్వెల్ విషయమై చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడే తీస్తారా లేక ప్రభాస్ చిత్రం అనంతరం తీస్తారా అన్నది చెప్పలేదు.

ఈగ తెలుగులోనే కాక,తమిళ,మళయాళ భాషల్లో కూడా ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 3D వెర్షన్ పై అందరి దృష్టీ వెళ్ళుతోంది. హిందీలో ఈ చిత్రం డబ్ చేసి,త్రీడి ఫార్మెట్ లోకి మార్చి రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం త్రీడి కన్వర్షన్ వర్క్ జరుగుతోంది. ఇక నార్త్, మహా రాష్ట్రలలో ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి చెప్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఓ సినిమాని 3D లోకి మార్చి రిలీజ్ చేయటం అంటే కష్టం. ఎందుకంటే 3D లోకి ఓ చిత్రాన్ని మార్చాలంటే చాలా టైమ్ తీసుకుంటుందనేది నిపుణులు చెప్తున్న మాట.

ఇక ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి రాజమౌళి మీడియా తో మాట్లాడుతూ...'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించ లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేసారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్‌ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు.


Share with Friends :

Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger