''బన్నీది చిన్నపాత్రే కావచ్చు. కానీ కథలో చాలా కీలకం. పూర్తిస్థాయి మల్టీస్టారర్ చిత్రంలో ఇద్దరం కలిసి నటించడానికి సిద్ధమే. అయితే అందుకు ఇంకాస్త సమయం పడుతుంది'' అని రామ్ చరణ్ అన్నారు. రామ్ చరణ్,బన్ని కలిసి నటిస్తున్న 'ఎవడు'చిత్రం గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఇలా స్పందించారు. ఈ చిత్రంలో బన్నీ ఓ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో బన్నీ పాత్రకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోయినా..మెగా అభిమానులు కోపగించుకోరు. కారణం ఈ సినిమాలో ఉన్న మరో హీరో మెగా హీరోనే కాబట్టి అని దర్శక,నిర్మాతలు ధీమాగా ఉన్నారు.
రామ్‌చరణ్-అల్లు అర్జున్‌లు కలిసి నటిస్తారనే విషయం మీద ఎప్పటి నుంచో చర్చ నడుస్తూనే ఉంది. ఓ దశలో 'చరణ్ అర్జున్' అనే పేరు కూడా అనుకొన్నారు. అయితే కథలేవీ సిద్ధం కాలేదు. 'ఎవడు' సినిమా ఆ లోటు తీరుస్తోంది అని అంటున్నారు. రామ్ చరణ్ తేజ,వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో రీసెంట్ గానే చేసారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా మారారు. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. ‘మద్రాసు పట్టణం’ అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత ‘ఏక్ దివానాథా’ అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.
దేవిశ్రీప్రసాద్ బాణీలతో జోరుగా ముస్తాబవుతోన్న ఈ సినిమాకి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అల్లు అర్జున్ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. ఇక తమన్నాతో కలిసి రామ్‌చరణ్ చేసిన 'రచ్చ' ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ సినిమాలోనూ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలూ మాస్ ని టార్గెట్ చేసినవే కావటం విశేషం. ఆరెంజ్ ప్లాప్ కావటంతో రామ్ చరణ్ పూర్తిగా తన తండ్రి నటించిన సూపర్ హిట్స్ తరహా పాత్రలనే ఎంచుకోవటానికే ఆసక్తి చూపుతున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment