యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొంద బోతున్న యాక్షన్ అండ్ కామెడీ మూవీ ‘బాద్ షా’ చిత్రం జూన్ 15 నుంచి హైదరాబాద్‌లో షూటింగు జరుపుకోబోతోంది. మార్చ్‌లో లాంచ్ చేయబడ్డ చిత్రం శ్రీను వైట్ల దర్శకత్వంలో శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గతంలో ఈచిత్రం తొలి షెడ్యూల్ ఇటలీలో ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చినా....తాజాగా యాక్షన్ సీక్వెన్స్‌తో మైదరాబాద్‌లోనే మొదలు పెడుతున్నారు. తొలి షెడ్యూల్ విలన్లతో గొడవలు పడుతూ చిత్రీకరించే సన్నివేశాలతో మొదలు కానుంది. ఫైట్ మాస్టర్ విజయన్ అండ్ టీం ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు. మరో వైపు జూన్ నెలలోనే ఈచిత్రానికి సంబంధించిన పాటల కంపోజింగ్‌ను సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పూర్తి చేయనున్నారు.
గతంలో రెడీ, దూకుడు లాంటి విజయవంతమైన ఎంటర్ టైన్మెంట్ చిత్రాలను రూపొందించిన శ్రీను వైట్ల.....‘బాద్ షా’ చిత్రాన్ని కూడా హిల్లోరియస్, అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్నారు. సినిమాలో పంచ్ డైలాగులు, కామెడీ సీన్లు బాగా దట్టించమే కాకుండా....దుమ్మురేపే యాక్షన్ సన్నివేశాలు కూడా ప్లాన్ చేశారు.
కోన వెంకట్, గోపీ మోహన్ స్క్రిప్టు రచయితలుగా పని చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్, దూకుడు చిత్రానికి పని చేసిన సాంకేతిక వర్గం ఈచిత్రానికి పని చేస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ఈ చిత్రం పూర్తిస్ధాయి ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుందని తమన్ హామీ ఇస్తున్నారు. ఆయన ఈ చిత్రం కథ విని ట్వీట్ చేసి ఎన్టీఆర్ అభిమానులను ఆనందపరిచారు. తమన్ ట్వీట్ లో...'బాద్‌షా' స్క్రిప్టు సూపర్ గుడ్...ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్. చాలా ఎనర్జీతో ఉంటుంది. మంచి సిట్యువేషన్స్ తో గొప్ప విజువల్ ఫీస్ట్ లా అలరిస్తుంది అని ట్వీట్ చేసారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment