సుమారు 15 సంవత్సరాల తర్వాత డ్రీమ్ హీరోయిన్ శ్రీదేవి మరోసారి తెరపై తళుక్కుమంటోంది. బాలీవుడ్ చిత్రం ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే ఈసరికే పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతూ అప్పుడప్పుడు బక్కచిక్కి తారసపడుతోంది. ఈ నేపధ్యంలో ఆమె సినిమాల్లో నటిస్తే ఏం చూస్తారూ.. అనే వ్యాఖ్యలు సైతం వినబడ్డాయి.
ఈ వ్యాఖ్యలను పక్కనపెడుతూ తాజాగా ఆమె నటించిని ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం ట్రెయిలర్ ముందుకు వచ్చింది. ఈ ట్రెయిలర్‌లో శ్రీదేవి గెటప్ చూసి బాలీవుడ్ పరిశ్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా నోరెళ్లబెడుతోందట. కారణం... ఆ చిత్రంలో శ్రీదేవి గ్లామర్ అదిరిపోయిందట. ట్రెయిలర్‌కు మంచి టాక్ రావడంతో శ్రీదేవి ఇన్నింగ్స్ బంపర్ రేసుతో దూసుకుపోవడం ఖాయమని అంటున్నారు.
ఈ చిత్రంలో శ్రీదేవి మధ్యతరగతి కుటుంబ మహిళగా నటిస్తోంది. నెల రోజుల్లో ఇంగ్లీషు నేర్చుకుని తన భర్తను మెప్పించే పాత్రలో శ్రీదేవి నటన సూపర్బ్‌గా ఉంటుందని దర్శకులు చెపుతున్నారు.
Post a Comment