రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు. మెగా ఫ్యామిలీని నా కుటుంబంగా భావిస్తాను. మా ఇంట్లో ఎవరికైనా వివాహం జరుగుతుంటే నేను తప్పకుండా డ్యాన్స్ చేస్తాను తమన్నా. ఇటీవల రామ్‌చరణ్ వివాహ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. సంగీత్‌లో రెండు పాటలకు కూడా డ్యాన్స్ చేసింది. అందుకు గానూ పారితోషికం అందుకుందనే వార్తలు వచ్చాయి. తమన్నా ఇలా మాట్లాడి క్లారిఫై చేసింది తమన్నా.
అలాగే ఎవరింట్లో అయినా డ్యాన్స్‌లు చేయడం సహజమే కదా. నేను నా ఫ్రెండ్ పెళ్ళిలో స్టెప్పులు వేసిన విషయాన్ని మీడియా అంతగా పట్టించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలియకుండా విన్నదీ, ఊహించిందీ చెప్పేస్తే ఎలా? అంటూ ఎదురు ప్రశ్నించిందామె.
ప్రస్తుతం ఆమె కరుణాకరన్ దర్శకత్వంలో నటించిన 'ఎందుకంటే.. ప్రేమంట!'విడుదైంది. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అలాగే 1981 లో విడుదలైన సూపహ్ హిట్ 'ఊరికి మొనగాడు'ను ఇప్పుడు మరోసారి హిందీలో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో తమన్నానే హీరోయిన్ గా ఖరారుచేసినట్లు సమాచారం. హీరోయిన్స్ గా దీపిక పదుకొణె, కత్రినా కైఫ్, అనుష్క శర్మలను పరిశీలించారు. వారి కంటే తమన్నా అయితే ఉత్తరాది ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ భావించినట్లు తెలిసింది. ఆమెతో సంప్రదింపులు సాగించి ఓకే చేసినట్లు సమాచారం.
గతంలో 1983లోనే 'ఊరికి మొనగాడు' చిత్రాన్ని 'హిమ్మత్‌వాలా'గా రీమేక్ చేసి హిట్ కొట్టారు. అప్పటి చిత్రంలో జితేంద్ర, శ్రీదేవి జంటగా నటించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 'హిమ్మత్‌వాలా' తరవాత శ్రీదేవి హిందీలో స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు సాజిద్‌ఖాన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుందని సమాచారం.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment