పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించిన పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే ఆయనో పెద్ద హీరో కాబట్టి. అందులోనూ చాలా ప్రత్యేకంగా ఉండటానికి పవన్ ప్రయత్నిస్తాడు కాబట్టి అతనంటే క్రేజ్ ఏర్పడింది అభిమానుల్లో....
ఇటీవల తన ఓ ఇంటర్య్వూలో మనసులోని మాటను బయట పెట్టారు. తాను ఉపవాసాలు ఉంటాను కానీ... దేవుడి కోసం మాత్రం కాదు అని నిజం ఒప్పేసుకున్నాడు పవన్ స్టార్. మరి ఎందు కోసం అంటే...తన శరీరంలో కొవ్వును తగ్గించుకోవడానికే అని నిర్మొహమాటంగా చెప్పేశారు. దేవుళ్లు ఇంతమంది మన దగ్గరున్నారంటే.. అవన్నీ మనమే సృష్టించుకున్నాం అంటున్నారు. తానకు దేవుడు లాంటి నమ్మకాలు లేవని, ప్రకృతిని ఆరాధిస్తా. పంచభూతాలే దేవుళ్ళు అనుకుంటా..అని చెప్పుకొచ్చారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం తెలుగు సినిమా రికార్డులు బద్దలు కొట్టి రేపు(జూన్ 29)న 50 రోజుల వేడుక జరుపుకోబోతోంది. పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ఈచిత్రం నిలిచింది. ఈచిత్రం చేయాలనే ఆలోచన చేసింది స్వయంగా పవన్ కళ్యాణే...తన ఆలోచన ద్వారా దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ శృతి హాసన్, నిర్మాత బండ్ల గణేష్‌లకు చాలా మేలు చేశాడు పవర్ స్టార్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment