Home »
Gossips
» ఎవరితోనైనా చేస్తానంటున్న బక్కపిల్ల ఇలియానా
ఎవరితోనైనా చేస్తానంటున్న బక్కపిల్ల ఇలియానా
నటి ఇలియానా ఇటీవల చాలా బక్కగా మారిపోయింది. గ్లామర్ పలుచబడిన ఈ హీరోయిన్ ఇటీవలే యూత్ హీరోలతో నటిస్తానని చెప్పింది. తెలుగు, తమిళంలో అలాంటి కథానాయకుల చిత్రాలే రావడం ఒక కారణం. సీనియర్స్ హీరోలతో చేస్తే వయస్సు పెరిగిందనుకుంటారని అలా చెప్పి ఉంటుందనుకున్నారు. ప్రస్తుతం రవితేజతో 'దేవుడు చేసిన మనుషులు'లో చేసింది. అల్లు అర్జున్‌తో జులాయి చిత్రంలో నటించింది. ఇద్దరూ వయస్సు రీత్యా చాలా తేడా ఉన్నవారే. తమిళంలో యువ హీరోలతో చేస్తుంది కూడా. అయితే ఇటీవల ఆమె బాడీని చూసిన దర్శకనిర్మాతలు ఛాన్సులిచ్చేందుకు ముందుకు రావడం లేదట. దీంతో తాను యువ హీరోలతోనే నటిస్తానని అనలేదని... కథ ప్రకారం తగిన పాత్రలే చేస్తానని చెప్పానని... హీరోలు చిన్నా పెద్దా తేడా లేదనీ అందరూ హీరోలేనని ప్లేటు మార్చింది. మరి ఈస్టేట్‌మెంట్‌తో అవకాశాలు వస్తాయేమో చూడాలి.
Post a Comment